| మురళీ కృష్ణ's profileమీకు తెలుసా!BlogLists | Help |
|
మీకు తెలుసా!August 11 బుడతడి మిమిక్రీ
జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ కార్యక్రమంలో ఓ బుడతడి మిమిక్రీ ప్రోగ్రాం. చూసి ఆనందించండి. April 12 మమ్మీకరణ - కొన్ని సంగతులు
Sources: Teeter, Emily. Presentation of Maat: Ritual and Legitimacy in Ancient Egypt and Scarabs, Scarboids, Seals and Seal Impressions from Medinet Habu. N.p., n.d February 09 ఆడవాళ్ళ సంగతులు కొన్ని(అమెరికా)
మహిళల శాతం ౧౯౫౦(1950) ౧౯౯౯(1999) December 20 అద్దంలో సూరీడుఅద్దంలో సూరీడంటే ఏమిటో అనుకుంటున్నారా?
![]() ![]() ఆల్ప్స్ పర్వతాల నడుమ లోయలో సుమారు రెండొందలు మాత్రమే జనాభావున్న విగనెల్ల అనే ఇటలీ గ్రామానికి సూర్యుడు నవెంబరు 11 నుండి ఫిబ్రవరి 2 వరకూ కనిపించడు. పేరుకు ఇటలీలోనే వున్నా సైబీరియాలో వున్నట్లుంటుంది. సూర్యుడు కనపడడు, వెలుతురు వుండదు, పైగా మంచు కురుస్తూ వుంటుంది. కానీ ఆ గ్రామానికి నాలుగైదొందల అడుగుల ఎత్తులో మాత్రం సూర్యకాంతి సోకుతుంది. విగనెల్ల మేయర్ పియర్ఫ్రాన్కో మిడాలి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని గీకోమో బొన్జాని అనే ఆర్కిటెక్ట్‌తో ఎక్స్పెరిమెంట్ చేయించి అద్దం ప్లానుతో బయటకొచ్చాడు. క్రింద బొమ్మ చూడండి అర్థం అవుతుంది.
![]() ఈ రకంగా ప్లాన్ చేసిన అద్దం ఐదు మీటర్ల ఎత్తు, ఎనిమిది మీటర్ల వెడల్పుతో వుండి సూర్య గమనానికి అనుగుణంగా (మోటారు సాయంతో) తిరుగుతూ వుంటుంది. దీనికి సుమారు లక్ష యూరోలు ($167,400) దాకా ఖర్చవుతుందట. ప్రస్తుతానికి ఆ గవర్నమెంటు బడ్జెటు కష్టాల్లో వుంది. ఈ పథకం ఫలించిందంటే రోజుకు సుమారు 5 గంటల పాటు సూర్యరశ్మి ఈ గ్రామాన్ని తాకుతుంది. ఓ వైపు అద్దంలో సూరీడు, మరోవైపు తెల్ల్టి మంచు ఒకే సారి చూసే భాగ్యం ఆ గ్రామస్తులకు కలుగుతుంది. December 19 తాజ్ మహల్ - ట్రూ స్టోరీతాజ్ మహల్ - ట్రూ స్టోరీ
అందరూ అనుకుంటున్నట్లుగా తాజ్ మహల్ షాజహాన్ ప్రేయసి ముంతాజ్ స్మృతి మందిరం కాదట. అది ఒక పురాతన శివాలయమట. ఈ మాటన్నది పి.ఎన్.ఓక్ అనే ఓ పరిశోధకుడు. ఓక్ గారేమంటున్నారో టూకీగా కొన్ని వివరాలు మనమూ తెలుసుకుందాం.
* 5 వ మొఘల్ చక్రవర్తైన షాజహాన్ జైపూర్ మహరాజా నుంచి స్వాధీనపరచుకొన్న "తేజో మహాలయ" మనబడే శివాలయమే నేటి "తాజ్ మహల్"
* ఔరంగజేబు కాలం వరకూ వున్న మొఘల్ రాజ లేఖల్లో గానీ, అధికార పత్రాల్లో గానీ ఎక్కడా తాజ్ మహల్ ప్రస్తావన లేదు. * ప్రపంచంలో వున్న ఏ ఒక్క ముస్లిం దేశంలోనూ "మహల్" అనే పదం కలిగివున్న భవనం లేదు. * షాజహాన్ కాలంలో భారత దేశాన్ని దర్శించిన యూరోపియన్ దార్శనికులు ప్రాచీన సంస్కృత పదమైన "తేజ్-ఓ-మహాలయ" అనే పేరుకు దగ్గరైన "తేజ్-ఏ-మహల్"ను గురించి వర్ణించారు. * శివ లింగాలు, మరి కొన్ని విగ్రహాలు మూసివేయబడ్డ మందపాటి గోడల్లోను, రహస్య గదుల్లోను, పాలరాతి బేస్మెంట్ క్రింద వున్న ఎర్ర రాతి కట్టడాల్లోనూ వున్నట్లుగా తాజ్ మహల్ రిపేర్ వర్కర్లు చూసినట్లుగానూ తెలిసింది. అంతేకాదు ఈ విషయం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి తెలిసినా కూడా కొన్ని కారణాల వల్ల వెళ్ళడించకున్నారు. * తాజ్ మహల్ వున్న ఆగ్రా శివారాధనకు పేరు. ఆగ్రా లోని వెనుకటి కొన్ని తరాల పూర్వులు రాత్రి భోజనానికి ముందు ఐదు శివ మూర్తులకు పూజ చేసేవారట. కాని తరువాతి తరాల్లోని వారు బాల్కేశ్వర్, పృధ్వినాథ్, మనకామేశ్వర్, రాజరాజేశ్వర్ అనే నాలుగు మూర్తుల్నే పూజిస్తున్నారు. తాజ్ మహల్ గా పిలువ బడుతున్న తేజో మహలయంలోని ఆగ్రేశ్వర్ మహదేవ్ నాగ్నాథేశ్వరే మరుగున పడిపోయిన ఐదవ మూర్తి అవ్వచ్చు. * షాజహాన్ కాలంనాటి "బాద్షానామా"లో (పు.403,సం.1) డోం కలిగివున్న ఓ అద్భుత పెద్ద భవంతిని జైపూర్ మహారాజు జైసింగ్ నుంది ముంతాజ్ సమాధికోసం స్వాధీన పరచుకున్నట్లుగా వుంది. * యువరాజు ఔరంగజేబు తండ్రైన షాజహానుకు రాసిన లేఖ ప్రకారం 1652 లో ముంతాజ్ ను సమాధి చేసిన అనేక భవనాలు పాతవవడం వల్ల లీకవుతున్నాయని, డోం కు వుత్తరవైపున పగుళ్ళు వచ్చాయని, వాటికి అత్యవసర మరమ్మత్తులను తన ఖర్చుతో నే చేసినట్లు వుంది. కానీ భారత పురాతత్వ శాఖ తాజ్ మహల్ ముందుంచిన ఫలక ప్రకారం 1631 నుంది 1653 వరకూ (22 సాం||) నిర్మాణంలో వుంది. కానీ యదార్ధానికి షాజహాన్ కాలం నాటికే "తాజ్ మహల్" పాతబడి పోయినట్లు విశదమవుతుంది. * జోహన్ ఆల్బెర్ట్ మాన్డెల్స్లో 1638లో ఆగ్రాలో తన జీవితం గురించి వ్రాసినప్పుడెక్కడా తాజ్ మహల్ నిర్మాణంలో వున్నట్లెక్కడా చెప్పలేదు. (ముంతాజ్ చనిపోయిన 7 సంవత్సరాల తర్వాత). * అమెరికన్ లాబొరేటరీ నది వైపున వున్న తలుపు చెక్క మీద చేసిన Carbon 14 పరిశోధన ప్రకారం ఆతలుపు షాజహానుకు 300 సం. పూర్వపుదని తేలింది. * ఇ.బి.హావెల్, మిసెస్ కీనోయర్, మరియు సర్ డబ్ల్యూ.డబ్ల్యూ హంటర్హేవ్ అనే పేరొందిన పాశ్చాత్య ఆర్కిటెక్ట్‌ల ప్రకారం తాజ్ మహల్ హిందూ దేవాలయ సంప్రదాయాన్ననుసరించి కట్టబడిందిట. * తాజ్ మహల్ ముఖ ద్వారం దక్షిణానికూంది. అదే ఇస్లామిక్దైతే పడమరకుండలి. ఇలాంటివి సుమారు 110 కి పైగా ఓక్ గారి పుస్తకంలో సరూపంగా చెప్పబడ్డాయి.
Tajmahal The True Story authored by Shri P.N. Oak A. Ghosh Publisher, 5720 W. Little York No. 216, Houston, Texas 77091 |
||||||||||||||||||||||||||||
|
|