| మురళీ కృష్ణ's profileమీకు తెలుసా!BlogLists | Help |
|
|
December 20 అద్దంలో సూరీడుఅద్దంలో సూరీడంటే ఏమిటో అనుకుంటున్నారా?
![]() ![]() ఆల్ప్స్ పర్వతాల నడుమ లోయలో సుమారు రెండొందలు మాత్రమే జనాభావున్న విగనెల్ల అనే ఇటలీ గ్రామానికి సూర్యుడు నవెంబరు 11 నుండి ఫిబ్రవరి 2 వరకూ కనిపించడు. పేరుకు ఇటలీలోనే వున్నా సైబీరియాలో వున్నట్లుంటుంది. సూర్యుడు కనపడడు, వెలుతురు వుండదు, పైగా మంచు కురుస్తూ వుంటుంది. కానీ ఆ గ్రామానికి నాలుగైదొందల అడుగుల ఎత్తులో మాత్రం సూర్యకాంతి సోకుతుంది. విగనెల్ల మేయర్ పియర్‌ఫ్రాన్కో మిడాలి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని గీకోమో బొన్జాని అనే ఆర్కిటెక్ట్‌తో ఎక్స్‌పెరిమెంట్ చేయించి అద్దం ప్లానుతో బయటకొచ్చాడు. క్రింద బొమ్మ చూడండి అర్థం అవుతుంది.
![]() ఈ రకంగా ప్లాన్ చేసిన అద్దం ఐదు మీటర్ల ఎత్తు, ఎనిమిది మీటర్ల వెడల్పుతో వుండి సూర్య గమనానికి అనుగుణంగా (మోటారు సాయంతో) తిరుగుతూ వుంటుంది. దీనికి సుమారు లక్ష యూరోలు ($167,400) దాకా ఖర్చవుతుందట. ప్రస్తుతానికి ఆ గవర్నమెంటు బడ్జెటు కష్టాల్లో వుంది. ఈ పథకం ఫలించిందంటే రోజుకు సుమారు 5 గంటల పాటు సూర్యరశ్మి ఈ గ్రామాన్ని తాకుతుంది. ఓ వైపు అద్దంలో సూరీడు, మరోవైపు తెల్ల్టి మంచు ఒకే సారి చూసే భాగ్యం ఆ గ్రామస్తులకు కలుగుతుంది. May 27 H1 B వీసాల పెంపుగత కొన్ని సంవత్సరాలుగా నలుగుతూన్న H1 B వీసాల పెంపు ఓ కొలిక్కి వచ్చింది. మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి పెద్ద సంస్థలు 'ఔట్ సోర్సింగ్' ఆయుధంతో బ్లాక్‌మెయిల్ చెయ్యడంతో అమెరికా సంయుక్త రాష్ట్రాల సెనేటు వీసాల సంఖ్య రెట్టింపు చేయడనికి ఒప్పుకుంది - అదీ సంవత్సరానికి ఇరవై (20%) శాతం చొప్పున.
సందట్లో సడేమియా లాగా శరణార్ధులకు (మరో మాటలో అక్రమ వలసదార్లు) పౌరసత్వం ఇవ్వడానికి కూడా ఒప్పుకుంది.
ఐటీ ఉద్యోగులకు మంచిరోజులొచ్చాయి! |
|
|