మురళీ కృష్ణ's profileమీకు తెలుసా!BlogLists Tools Help

Blog


    June 07

    పరమత సహనం అంటే ఇదేనా?

    మూడ్రోజుల క్రితం టీవీ9 లో సింహాచలం మీద క్రిస్టియన్స్‌ మత ప్రచారం చేశారని వార్త చూపించారు.
     
    ఇది అబద్దం అనటానికి లేదు. వార్త విజువల్‌ క్లిప్పింగ్‌తో సహా చూపించారు. ఒక్క డెక్కన్‌ క్రానికల్‌లో తప్ప వేరే పత్రికల్లో ఇది కనపడలేదు. ??? ఇంతేకాదు, తిరుమల మీదకూడా ఇదే విధంగా జరిగినా ఒకట్రెండు రోజులు తప్ప పెద్దసందడేం లేదు. ఇది మన చేతకాని తనమా? లేక వాళ్ళ ...
     
    అధికారులు చెప్పినట్లుగా మత ప్రచారం తప్పుకాదు. కానీ వేరే మతాల వారి మనో భావాలను, ఆచారాలను ప్రశ్నించే విధంగా వుండకూడదు. ఇదే హిందూ లేదా ముస్లిం మత ప్రచారాలను ఏ చర్చిలోనో జరిపితే వాళ్ళ రియాక్షన్‌ ఎలా వుంటుందో ఆలోచించండి.
     
    భారత దేశం పరమత సహనానికి పేరు. అంతేకానీ తన మత పతనానికి కాదు.
    June 01

    పోలీసులా మజాకా !!!

    "నగరంలో వరసగా జరుగుతున్న చోరీలు...వాటికి సంబంధించిన పోలీసు రికవరీలు భారీ క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు సరిపోయే మసాలా కథను అందజేసేలా కనిపిస్తున్నాయి..." - ఈనాడు.
     
    నిజమేగా...

    1) అలూకాస్ లో 6 కోట్ల విలువ చేసే ఆభరణాల దొంగతనం.
    సినిమా ఫక్కీలో, ముంబాయి పోలీసుల సహకారంతో రెండ్రోజుల్లో దొంగలు పట్టుబడటం. నిన్న నగరంలో కోర్టులో హాజరు.

    2) శ్రీ నగర్ కాలనీలో, భాను అపార్ట్‌మెంట్‌లో 40 లక్షల సొత్తు చోరీ.
    గంటల వ్యవధిలో ఓ లాడ్జీలో నేరస్తుల అచూకీ కనుక్కోవటం, అంతే నాటకీయంగా నేరస్తులు తప్పించుకోవటం. ఓ ఐదు లక్షలు మినహా మిగతా సొమ్ము రికవరీ.
    పోలీస్ కమీషనర్ మహంతి: "ఈ సంఘటనలు పోలీసుల మీద ప్రజలకు నమ్మకాన్ని పెంచేందుకు దోహదం చేసింది."
     
     
    "మరిన్ని దొంగతనాలు జరగాలని, పోలీసులు మరింత తొందరగా నేరస్తులను పట్టుకొని ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవాలని ఆశిద్దామా!!"

    May 26

    వర్షమా! మజాకా!!

    గత రెండు రోజుల్నుంచి పడనా వద్దా అంటున్న వర్షం నిన్న మధ్యాహ్నం భళ్ళున కురిసింది. 3.4 cm అని వాతావరణ శాఖాధికారులు సెలవిచ్చారు. ఒక్కసారిగా వూరంతా చల్లబడింది. అంతా సంతోషమే కానీ 'ఇంటర్నేషనల్‌ లెవల్‌' అని చెప్పుకునే హైదరాబాదు రోడ్ల పరిస్థితి మాత్రం మహా ఘోరం. ఒక సెంటీ మీటరు వర్షం పడితే, నాలుగు సెంటీ మీటర్ల డ్రైనేజ్ వాటర్ రోడ్లమీద కొస్తుంది. ఇక ప్రయాణీకుల సంగతి చెప్పేదేముంది. ఇవి ఎప్పటికి బాగుపడతాయో? (అనుమానమే!)
     
    ఖైరతాబాదు, పంజాగుట్ట, మాదాపూర్ వెళ్ళే బంజారా హిల్స్ రోడ్డు, (మచ్చుకు కొన్ని) రోడ్లలా కాక ... పిల్ల కాలువల్లాగా తయారైనాయి. స్యుయేజ్ వెంట్స్ నీళ్ళను తీసుకోవాల్సింది పోయి, ఎక్కడెక్కడి దరిద్రాన్నంతా బయటకు పంపాయి. ఓహటే కంపు.