| మురళీ కృష్ణ's profileమీకు తెలుసా!BlogLists | Help |
|
|
December 19 తాజ్ మహల్ - ట్రూ స్టోరీతాజ్ మహల్ - ట్రూ స్టోరీ
అందరూ అనుకుంటున్నట్లుగా తాజ్ మహల్ షాజహాన్ ప్రేయసి ముంతాజ్ స్మృతి మందిరం కాదట. అది ఒక పురాతన శివాలయమట. ఈ మాటన్నది పి.ఎన్.ఓక్ అనే ఓ పరిశోధకుడు. ఓక్ గారేమంటున్నారో టూకీగా కొన్ని వివరాలు మనమూ తెలుసుకుందాం.
* 5 వ మొఘల్ చక్రవర్తైన షాజహాన్ జైపూర్ మహరాజా నుంచి స్వాధీనపరచుకొన్న "తేజో మహాలయ" మనబడే శివాలయమే నేటి "తాజ్ మహల్"
* ఔరంగజేబు కాలం వరకూ వున్న మొఘల్ రాజ లేఖల్లో గానీ, అధికార పత్రాల్లో గానీ ఎక్కడా తాజ్ మహల్ ప్రస్తావన లేదు. * ప్రపంచంలో వున్న ఏ ఒక్క ముస్లిం దేశంలోనూ "మహల్" అనే పదం కలిగివున్న భవనం లేదు. * షాజహాన్ కాలంలో భారత దేశాన్ని దర్శించిన యూరోపియన్ దార్శనికులు ప్రాచీన సంస్కృత పదమైన "తేజ్-ఓ-మహాలయ" అనే పేరుకు దగ్గరైన "తేజ్-ఏ-మహల్"ను గురించి వర్ణించారు. * శివ లింగాలు, మరి కొన్ని విగ్రహాలు మూసివేయబడ్డ మందపాటి గోడల్లోను, రహస్య గదుల్లోను, పాలరాతి బేస్‌మెంట్ క్రింద వున్న ఎర్ర రాతి కట్టడాల్లోనూ వున్నట్లుగా తాజ్ మహల్ రిపేర్ వర్కర్లు చూసినట్లుగానూ తెలిసింది. అంతేకాదు ఈ విషయం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి తెలిసినా కూడా కొన్ని కారణాల వల్ల వెళ్ళడించకున్నారు. * తాజ్ మహల్ వున్న ఆగ్రా శివారాధనకు పేరు. ఆగ్రా లోని వెనుకటి కొన్ని తరాల పూర్వులు రాత్రి భోజనానికి ముందు ఐదు శివ మూర్తులకు పూజ చేసేవారట. కాని తరువాతి తరాల్లోని వారు బాల్కేశ్వర్, పృధ్వినాథ్, మనకామేశ్వర్, రాజరాజేశ్వర్ అనే నాలుగు మూర్తుల్నే పూజిస్తున్నారు. తాజ్ మహల్ గా పిలువ బడుతున్న తేజో మహలయంలోని ఆగ్రేశ్వర్ మహదేవ్ నాగ్‌నాథేశ్వరే మరుగున పడిపోయిన ఐదవ మూర్తి అవ్వచ్చు. * షాజహాన్ కాలంనాటి "బాద్‌షానామా"లో (పు.403,సం.1) డోం కలిగివున్న ఓ అద్భుత పెద్ద భవంతిని జైపూర్ మహారాజు జైసింగ్ నుంది ముంతాజ్ సమాధికోసం స్వాధీన పరచుకున్నట్లుగా వుంది. * యువరాజు ఔరంగజేబు తండ్రైన షాజహానుకు రాసిన లేఖ ప్రకారం 1652 లో ముంతాజ్ ను సమాధి చేసిన అనేక భవనాలు పాతవవడం వల్ల లీకవుతున్నాయని, డోం కు వుత్తరవైపున పగుళ్ళు వచ్చాయని, వాటికి అత్యవసర మరమ్మత్తులను తన ఖర్చుతో నే చేసినట్లు వుంది. కానీ భారత పురాతత్వ శాఖ తాజ్ మహల్ ముందుంచిన ఫలక ప్రకారం 1631 నుంది 1653 వరకూ (22 సాం||) నిర్మాణంలో వుంది. కానీ యదార్ధానికి షాజహాన్ కాలం నాటికే "తాజ్ మహల్" పాతబడి పోయినట్లు విశదమవుతుంది. * జోహన్ ఆల్బెర్ట్ మాన్‌డెల్స్లో 1638లో ఆగ్రాలో తన జీవితం గురించి వ్రాసినప్పుడెక్కడా తాజ్ మహల్ నిర్మాణంలో వున్నట్లెక్కడా చెప్పలేదు. (ముంతాజ్ చనిపోయిన 7 సంవత్సరాల తర్వాత). * అమెరికన్ లాబొరేటరీ నది వైపున వున్న తలుపు చెక్క మీద చేసిన Carbon 14 పరిశోధన ప్రకారం ఆతలుపు షాజహానుకు 300 సం. పూర్వపుదని తేలింది. * ఇ.బి.హావెల్, మిసెస్ కీనోయర్, మరియు సర్ డబ్ల్యూ.డబ్ల్యూ హంటర్‌హేవ్ అనే పేరొందిన పాశ్చాత్య ఆర్కిటెక్ట్‌ల ప్రకారం తాజ్ మహల్ హిందూ దేవాలయ సంప్రదాయాన్ననుసరించి కట్టబడిందిట. * తాజ్ మహల్ ముఖ ద్వారం దక్షిణానికూంది. అదే ఇస్లామిక్‌దైతే పడమరకుండలి. ఇలాంటివి సుమారు 110 కి పైగా ఓక్ గారి పుస్తకంలో సరూపంగా చెప్పబడ్డాయి.
Tajmahal The True Story authored by Shri P.N. Oak A. Ghosh Publisher, 5720 W. Little York No. 216, Houston, Texas 77091 August 26 అమరజీవి పొట్టి శ్రీరాములు"పొట్టి శ్రీరాముల్లాంటి వారు ఓ పది మందుంటే చాలు, మనకు స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చేసేది"
- మహాత్మా గాంధీ
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి కొన్ని విషయాలు ...
May 30 టీవీ??? (కంటిన్యుయేషన్)ఇంటర్వ్యూలో సెలక్టయ్యానని చెప్పాగా! ఫైనల్ రౌండొక్కటి - HRతో పర్సనల్ ఇంటర్వ్యూ వుంది. అదీ నాల్రోజుల తర్వాత కబురు పెట్టారు. ఇంటర్వ్యూ గదిలో... GD కొచ్చిన ఇంటర్వ్యూయర్ పిల్లే అక్కడవుంది. మర్యాదలయ్యాయి. కుర్చీలో కూర్చోమంది. కుర్చీ గదిలో మధ్యలో వుంది. ఆ అమ్మాయి టేబుల్‌ను ఆనుకుని క్రాస్ లెగ్స్‌తో నుంచోనుంది. ఆమె: "Tell me frankly, how sure you are before attending the interview on getting this job?" నిజానికి నాకే మాత్రం ఆశలేదు ముందు, కానీ GD లో సెలక్ట్ అయ్యాక మాత్రం చాలా హోప్ పెట్టుకున్నా. నేను: వస్తుందని పెద్దగా ఎక్స్పెక్ట్ చెయ్యలేదండీ, కానీ... కర్ట్‌గా, ఇన్స్టంటేనియస్‌గా వచ్చిన ఆ జవాబు విని బిత్తర పోయా. అయిపోయింది. మనకు రాసిపెట్టిలేదు అనుకుని బయటకు వచ్చా. ఒకింత బాధగా వుంది. బయటున్న మిగతా వాళ్ళు ఏమయిందని అదుగుతున్నా, ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చేశా. ఓ రెండ్రోజుల పాటు కొద్దిగా బాధ పెట్టినా తరువాత మర్చిపోయా. ఓ రోజు, నేనూ ఒక ఫ్రెండ్‌తో కలిసి రోడ్డు సైదు పైపులైను మీద వేసిన సిమెంటు చప్టా మీద కూర్చుని 'ఎలక్ట్రానిక్స్' గురించి పిచ్చా పాటీ మాట్లాడుకుంటున్నాము. టాపిక్ ఏమిటంటే 'How to peep into others conversations?' పుస్తకాల్లో మేము చూసిన సర్క్యూట్స్ గురించి మాట్లాడుకుంటున్నము. ఇంతలో మావాడి మొబైల్ మోగింది. వాడు 'హలో' అని మాట్లాడి, 'నీకే ఫోను ' అంటూ నాకిచ్చాడు. ఫోను: హాయ్, ఐయాం పల్లవి, నెనపిదియా? (గుర్తున్నానా?) పబ్లిక్ ఫోన్ నుంచి ఫోన్ చేశాం. నేను: HR మేనేజరు గారున్నారాండీ. మాట్లాడాలి. దొరికిందే సందని నోట్ చేసుకున్నా. "ఒరేయ్ నా సెల్లోంచి చెయ్యక, ఏమన్నా అయితే నన్ను పట్టుకుంటారు." "ఓక వేళ నెంబరు తప్పు రాసుకున్నానేమో, ఇంకోసారి ఇందాక ఫోన్‌చేసినమ్మాయిని కనుక్కోరాదా" అన్నాడు మావాడు. అప్పుడు పనిచెయ్యటం మొదలయ్యింది నా బుర్ర. నాకు ఫోనే లేదు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా నాతో మాట్లాడతానికి మా వాసు గాడి నెంబరిచ్చాను. వేరే ఎవ్వరికీ ఇవ్వలేదు. అసలు ఈ పల్లవికి ఈ నెంబరెవ్వరిచ్చారు. ఖఛ్ఛితంగా నేనైతే ఇవ్వలేదు. అసలు ఈ పల్లవెవరో, నా ఎదురుగా వచ్చి నిలబడినా గుర్తు పట్టలేను. బుర్రంతా గందరగోళం అయిపోయింది. "లాభం లేదు, ఈ విషయమేమిటో ఆ అమ్మాయినే అడిగేద్దాం. నీ ఫోనివ్వరా. లాస్ట్ కాల్ రీడయిల్ చెయ్యి" అన్నా. ఒక్కసారి కళ్ళు బైర్లు కమ్మాయి. IMRB ఆఫీసు వాళ్ళిచ్చిన నెంబరూ, పల్లవి నెంబరూ ఒకటే! ముగింపు రేపు.
May 27 టీ వీ ???చావా గారు వారాంతపు విషయం టీవీ అన్నారు. అది వినంగానే ఓ విషయం గుర్తొచ్చింది.
సుమారు 6 సంవత్సరాల క్రితం బెంగుళూరులో IMRB కి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అందులో G D కి వాళ్ళిచ్చిన టాపిక్ TV - Good or Evil, యిచ్చిన టైం అరగంట. 15 మంది - అందరూ MBA ఫ్రెషర్సే. అందరూ హోరాహోరీగా మాట్లాడుతున్నారు ... సారీ పోట్లాడు కుంటున్నారంటే బాగుంటుందేమో. ఇంటర్వ్యూయర్ (అమ్మాయి) ముందే హెచ్చరించింది - మార్కులు ఎంత కరెక్ట్‌గా చెప్పారనేదానికన్నా, ఎంత బాగా అవతలి వాళ్ళను కాంట్రడిక్ట్ చేశామనేదానికుంటాయి అని.
ఇంకేముంది ఒకడు మంచిది అని, మరొకడు కాదు చెడ్డదని, ఇంకొకతి ఎందుకు చెడ్డదని,మరింకొకతి .... అలా అలా దూకుడుగా, గట్టి గట్టిగా అరచు కొంటున్నారు. సందు దొరకక మాట్లాడే (పోట్లాడే) అవకాశం దొరకక నాలా ఓ ముగ్గురు ఆగిపోయాం. 25 నిమిషాలు దాటిపోయింది. చటుక్కున నాకో ఐడియా వచ్చింది. వెంటనే లేచి ...
"25 నిమిషాలు దాటిపోయింది. ప్లీజ్ స్టాప్ ఆర్గ్యూయింగ్. ఇట్స్ టైం ఫర్ కంక్లూడ్." అన్నా.
అందరు ఒక్కసారిగా ఆగిపోయారు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఇంటర్వ్యూయర్ క్వొశ్చెన్ మార్కు ఫేస్‌తో నా వైపు చూస్తోంది.
"జాన్ లాగీగైర్డ్ టీవీ కనుక్కున దగ్గర్నుంచీ కొత్త సోనీ ట్రినిటాన్ పిక్చర్‌ట్యూబ్ దాకా, కార్టూన్స్ గురించీ, సీరియల్స్ గురించీ, భక్తి ప్రభోదాత్మక పాటల గురించీ, సెక్సీ సాంగుల గురించీ, సినిమాల గురించీ, ..... ఇలా చాలా వాటి గురించి మీ రందరూ మీ మీ అభిప్రాయాలు చెప్పారు. చాలా బాగున్నాయి. ఒక రకంగా అలోచిస్తే మీ రందరూ చెప్పినవి చాలా .. చాలా వరకూ కరక్టే. మీలో కొందరు కొన్ని రెమెడీస్ కూడా సూచించారు. వాటినమలుచేయడంలో వున్న సాధ్యాసాధ్యాల గురించి ప్రక్కన పెడితే, చాలా మంచి సూచనలు చేశారు." ఓ రెండు సెకన్లు గాపిచ్చా.
అందరి మొహాల్లో ఓ రకమైన రిలీఫ్. " కానీ మీ రొక్క విషయం మర్చిపోయారు." సడన్‌గా అందరి మొహాల్లోనూ క్వశ్చన్ మార్కులు ... ఇంటర్వ్యూయర్‌తో సహా.
"టాపిక్ ఏమిటి? టీవీ మంచిదా చెడ్డదా అని. అంతేకాని టీవీల్లో వచ్చే కథలు, కవితలు, సినిమాలు, సీరియల్లూ, న్యూసూ, కన్ఫ్యూషన్లూ, టెక్నికల్ ప్రోగ్రామ్సూ, ఎడ్యుకేషన్ కంటెంటూ, ఎట్సెట్రా, ఎట్సెట్రా, గురించి కాదు." అందరి మొహాలూ తెల్ల బోయాయ్. కొందరు నాలిక్కరుచుకున్న వాళ్ళూ వున్నారు.
"కత్తి మంచిదా చెడ్డదా? హంతకుడి చేతిలో వుంటే చెడ్డది, వంటింట్లో అమ్మ చేతిలో వుంటే మంచిది. ఏమంటారు? రాయిని తీసుకోండి. పిచ్చోడి చేతిలో వుంటే ప్రమాదకరం, తాపీ మేస్త్రీ చేతిలో వుంటే లాభకరం, అదే ఏ గుళ్ళో పూజారి చేతిలో వుంటే భక్తికరం. అవునంటారా? (సమాధానం కొఱకు ఎదురు చూడలా) కాబట్టి నే చెప్పేదేమిటంటే ... వస్తువు న్యూట్రల్, వుపయోగించే విధానమే మంచిదైనా, చెడ్డదైనా. So my conclusion is TV is neutral. It only depends on people how they use, and perceive. That's it" అని కూర్చున్నా.
చెప్పేదేముంది. ఇంటర్వ్యూలో సెలక్టయిన వాళ్ళలో నేనూ ఒకడిని.
దీనికో కొసమెరుపుంది. రేపు చెబుతా. ఈ లోపు నా స్పీచ్ గురించి ఆలోచించండి. |
|
|