మురళీ కృష్ణ's profileమీకు తెలుసా!BlogLists Tools Help

Blog


    August 11

    బుడతడి మిమిక్రీ

     

    జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ కార్యక్రమంలో ఓ బుడతడి మిమిక్రీ ప్రోగ్రాం. చూసి ఆనందించండి.

      

     

    October 06

    క్రిస్‌మస్ తాతగా పిలుచుకునే శాంతాక్లాజ్ తిప్పలు

    1. ఇప్పటి వరకూ వర్గీకరింపబడిన జీవజాలాల్లో ఎగరగలిగే ధృవపుజింక(దుప్పి-Reindeer) లేదు. ఇంకా 300,000 జాతులు (ఎక్కువగా క్రిములు, కీటకాలే వున్నాయి) వర్గీకరింప బడలేదు కాన అందులో క్రిస్‌మస్ తాత జింక వుండే అవకాశాన్ని కొట్టిపారేయలేం.
    2. ప్రపంచంలో సుమారు 2 బిలియన్ల మంది పిల్లలున్నట్లు (18 సం. లోపు) అంచనా. అందులో శాంతా ముస్లిం, హిందూ, బౌద్ధులను పట్టించుకోడు కనుక పై మొత్తంలో 15% పని భారం తగ్గుతుంది. మిగిలిన వాళ్ళలో సగటున ఒక ఇంటికి 3.5 గురు పిల్లవాళ్ళను లెక్కవేస్తే (Population Reference Bureau ప్రకారం) 91.8 మిలియన్ల ఇండ్లు లెక్కకు వస్తాయి. కనీసం ఇంటి కొక్క పిల్లవాడైన బుద్ధిమంతుడై వుండచ్చనది భావన.
    3. వివిధ టైం జోన్లు, మరియు భూ భ్రమణలను పరిగణనలోకి తీసుకుంటే శాంతాకు 31 గంటల సమయం వుంటుంది తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడానికి. అంటే, పై చెప్పుకున్న ఇళ్ళన్నీ 31 గంటల్లో సందర్శించాలంటే శాంతా సెకనుకు 822.6 యిళ్ళు చూడాలి. అంటే సుమారుగా సెకనులో వెయ్యోవంతు సమయంలో శాంతా తన బండిని ఆపి, దిగి, పొగ్గొట్టం ద్వారా లోపలికి దూరి, తను తెచ్చిన బహుమతులను అక్క దాచి, వాళ్ళు తనకోసం వదిలిపెట్టిన పదార్ధాలను ఆరగించి, తిరిగి చిమ్నీ ద్వారా బయటకు వచ్చి, ఆపివున్న బండెక్కి తర్వాత యింటికి వెళ్ళాలి. 91.8 మిలియన్ల యిళ్ళు సమదూరంలో వున్నాయని (వుండవనుకోండి) మనలెక్క కొఱకు అనుకుంటే, ఇంటింటికీ మధ్య దూరం 0.78 మైళ్ళు, అంటే ఢెబ్భయ్యైదున్నర మిలియన్ మైళ్ళు 31 గంటల్లో తిరగాలి. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే, శాంతా సెకనుకు 650 మైళ్ళ వేగంతో (ధ్వని వేగానికి 3000 రెట్లు ఎక్కువ) ప్రయాణించాలి. అత్యంత వేగం కలిగిన మానవనిర్మిత వాహనం యూలిసిస్ (Ulysis) స్పేస్ ప్రోబ్ వేగం 27.4 మైళ్ళ కాగా, సాధారణ ధృవపు జింక గంటకు 15 మైళ్ళ వేగాన్ని అందుకోగలదు.
    4. ఇకపోతే శాంతా గారి బండి మీదున్న బరువు మరొక ఆసక్తి కరమైన విషయాన్ని చెపుతుంది. ఉదాహరణకు ప్రతిపిల్లవాడికి 2 ఫౌండ్ల బరువున్న లెగో బొమ్మల సెట్టు కన్నా పెద్ద బహుమతి ఇవ్వలేదనుకుంటే, తాతగారి బండి 321,300 టన్నుల బరువు మొయ్యాల్సి వుంటుంది. (బహు భారీ కాయుడుగా చెప్పుకునే తాత గారి బరువును మినహాయిస్తేనే సుమా!) సాధారణ ధృవపు జింక 300 ఫౌన్ల కన్నా ఎక్కువ బరువు మొయ్యలేదు మరి. ఒకవేళ ఎగిరే దుప్పి వుందనుకుంటే, అది ఓ పదిరెట్లు ఎక్కువ బరువు (సాధారణ మైన వాటితో పోలిస్తే) మోయగలదనుకుంటే, తాత గారికి 214,200 ఎగిరే దుప్పులు కావలసి వుంటుంది. ఇంకా బండి బరువు, మన తాతగారి బరువూ కలిపితే సుమారు 353,430 టన్నులుంటుంది. పోలిక కోసం ఈ చెప్పుకున్న బరువు క్వీన్ ఎలిజబెత్ కన్న 4 రెట్లు ఎక్కువ. (క్వీన్ ఎలిజబెత్ అంటే ఏమిటో అనుకునేరు ... ఓ పెద్ద షిప్పండీ బాబూ!!)
    5. 353,430 టన్నుల లోడు సెకనుకు 650 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తే అది అత్యంత తీవ్రమైన గాలి రాపిడికి గురౌతుంది. ఇది ముందున్న దుప్పులకు 14.3 క్వింటిలియన్ జౌళ్ళ శక్తిని అందజేస్తుంది.. అదీ ఒక సెకనుకు. టూకీగా చెప్పాలంటే తత్-క్షణమే పాపం దుప్పులు బూడిదకూడా మిగలనంతగా మండిపోతాయి. బండిని లాగే మొత్తం దుప్పుల గుంపు సెకనులో 4.26 వేలవ వంతులో గాల్లో కలిసిపోతాయి. ఇకపోతే మన తాత గారు తన గురుత్వాకర్షన (gravity) శక్తికి 17,500.06 రెట్లు centrifugal ఫోర్సుకు (తెలుగులో గుర్తుకు రాలేదు) లోనవుటాడు. క్రిస్‌మస్ తాత సుమారు 250 ఫౌన్ల బరువు వుంటాడనుకుంటే, 4,315,015 ఫౌన్ల ఫోర్సుతో వెనక్కి నొక్కి వేయబడతాదు.
    ఒకవేళ నిజంగా శాంతా క్లాజ్ ఈ పంచుడు కార్యక్రమం చేపడితే ... పాపం తాత గతేంటో ??!!
    September 23

    రాజకీయం

    రాజకీయం అంటే ఇంగ్లీషులో అర్థం తెలుసా మీకు?
    రాజకీయం = పాలిటిక్స్ (Politics)
    Politics = Poli+tics
    Poli అనేది Poly నుంచి వచ్చింది.
    tics అనేది Ticks కు రూపాంతరం.
    కాబట్టి
    Poly+Ticks=Politics అవుతుంది.
    ఇకపోతే,
    Poly అంటే many - "చాలా" అని అర్థం.
    Ticks అంటే Blood sucking parasites - రక్తం తాగే పరాన్నజీవులు, అంటే నల్లులన్నమాట.

    ఇంకా వివరంగా చెప్పాలా? ఈపాటికి అర్థం అయిపోయుండాలే!

    May 29

    మీరు పుట్టింటి కెళ్తానంటే...???

    ఈ రోజు ఆఫీసులో లంచ్‌ బ్రేక్‌లో FM రేడియో వింటున్నాము. అందులో ఏంకర్‌ శ్రోతలకు ఓ ప్రశ్న వేసింది

    "మీరు పిల్లలతో పుట్టింటి కెళతానంటె మీ శ్రీవారేమంటారు?"

    దీనికి ఒక్కో శ్రోత ఒక్కోరకంగా సమాధానాలను ఇచ్చారు ... అందరూ అమ్మాయి..సారీ ఆడవాళ్ళేననుకోండి.
    అది విని మావాళ్ళు సరదాగా వాళ్ళకు తోచిన సమాధానం చెప్పారు
     
     (మగవాళ్ళ సమాధానాలు)
    "అమ్మయ్య! నాల్రోజులు ప్రశాంతంగా వుండచ్చు"
    "చచ్చారు, మీ వాళ్ళ పనైపోయింది"
    "ఫ్రెండ్స్‌తో ఎంచక్కా మందుపార్టీ ఇంట్లోనే చేసుకోవచ్చు"
    "TVలో నాకిష్టమైన సినిమా (ప్రోగ్రాము) చూసుకోవచ్చు"
    "అయితే గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటికే తెచ్చుకోవచ్చన్నమాట"
    ...
     
    ఇలా సాగాయి సరదాగా!