| మురళీ కృష్ణ's profileమీకు తెలుసా!BlogLists | Help |
|
August 11 బుడతడి మిమిక్రీ
జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ కార్యక్రమంలో ఓ బుడతడి మిమిక్రీ ప్రోగ్రాం. చూసి ఆనందించండి. April 12 మమ్మీకరణ - కొన్ని సంగతులు
Sources: Teeter, Emily. Presentation of Maat: Ritual and Legitimacy in Ancient Egypt and Scarabs, Scarboids, Seals and Seal Impressions from Medinet Habu. N.p., n.d February 09 ఆడవాళ్ళ సంగతులు కొన్ని(అమెరికా)
మహిళల శాతం ౧౯౫౦(1950) ౧౯౯౯(1999) December 20 అద్దంలో సూరీడుఅద్దంలో సూరీడంటే ఏమిటో అనుకుంటున్నారా?
![]() ![]() ఆల్ప్స్ పర్వతాల నడుమ లోయలో సుమారు రెండొందలు మాత్రమే జనాభావున్న విగనెల్ల అనే ఇటలీ గ్రామానికి సూర్యుడు నవెంబరు 11 నుండి ఫిబ్రవరి 2 వరకూ కనిపించడు. పేరుకు ఇటలీలోనే వున్నా సైబీరియాలో వున్నట్లుంటుంది. సూర్యుడు కనపడడు, వెలుతురు వుండదు, పైగా మంచు కురుస్తూ వుంటుంది. కానీ ఆ గ్రామానికి నాలుగైదొందల అడుగుల ఎత్తులో మాత్రం సూర్యకాంతి సోకుతుంది. విగనెల్ల మేయర్ పియర్ఫ్రాన్కో మిడాలి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని గీకోమో బొన్జాని అనే ఆర్కిటెక్ట్‌తో ఎక్స్పెరిమెంట్ చేయించి అద్దం ప్లానుతో బయటకొచ్చాడు. క్రింద బొమ్మ చూడండి అర్థం అవుతుంది.
![]() ఈ రకంగా ప్లాన్ చేసిన అద్దం ఐదు మీటర్ల ఎత్తు, ఎనిమిది మీటర్ల వెడల్పుతో వుండి సూర్య గమనానికి అనుగుణంగా (మోటారు సాయంతో) తిరుగుతూ వుంటుంది. దీనికి సుమారు లక్ష యూరోలు ($167,400) దాకా ఖర్చవుతుందట. ప్రస్తుతానికి ఆ గవర్నమెంటు బడ్జెటు కష్టాల్లో వుంది. ఈ పథకం ఫలించిందంటే రోజుకు సుమారు 5 గంటల పాటు సూర్యరశ్మి ఈ గ్రామాన్ని తాకుతుంది. ఓ వైపు అద్దంలో సూరీడు, మరోవైపు తెల్ల్టి మంచు ఒకే సారి చూసే భాగ్యం ఆ గ్రామస్తులకు కలుగుతుంది. December 19 తాజ్ మహల్ - ట్రూ స్టోరీతాజ్ మహల్ - ట్రూ స్టోరీ
అందరూ అనుకుంటున్నట్లుగా తాజ్ మహల్ షాజహాన్ ప్రేయసి ముంతాజ్ స్మృతి మందిరం కాదట. అది ఒక పురాతన శివాలయమట. ఈ మాటన్నది పి.ఎన్.ఓక్ అనే ఓ పరిశోధకుడు. ఓక్ గారేమంటున్నారో టూకీగా కొన్ని వివరాలు మనమూ తెలుసుకుందాం.
* 5 వ మొఘల్ చక్రవర్తైన షాజహాన్ జైపూర్ మహరాజా నుంచి స్వాధీనపరచుకొన్న "తేజో మహాలయ" మనబడే శివాలయమే నేటి "తాజ్ మహల్"
* ఔరంగజేబు కాలం వరకూ వున్న మొఘల్ రాజ లేఖల్లో గానీ, అధికార పత్రాల్లో గానీ ఎక్కడా తాజ్ మహల్ ప్రస్తావన లేదు. * ప్రపంచంలో వున్న ఏ ఒక్క ముస్లిం దేశంలోనూ "మహల్" అనే పదం కలిగివున్న భవనం లేదు. * షాజహాన్ కాలంలో భారత దేశాన్ని దర్శించిన యూరోపియన్ దార్శనికులు ప్రాచీన సంస్కృత పదమైన "తేజ్-ఓ-మహాలయ" అనే పేరుకు దగ్గరైన "తేజ్-ఏ-మహల్"ను గురించి వర్ణించారు. * శివ లింగాలు, మరి కొన్ని విగ్రహాలు మూసివేయబడ్డ మందపాటి గోడల్లోను, రహస్య గదుల్లోను, పాలరాతి బేస్మెంట్ క్రింద వున్న ఎర్ర రాతి కట్టడాల్లోనూ వున్నట్లుగా తాజ్ మహల్ రిపేర్ వర్కర్లు చూసినట్లుగానూ తెలిసింది. అంతేకాదు ఈ విషయం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి తెలిసినా కూడా కొన్ని కారణాల వల్ల వెళ్ళడించకున్నారు. * తాజ్ మహల్ వున్న ఆగ్రా శివారాధనకు పేరు. ఆగ్రా లోని వెనుకటి కొన్ని తరాల పూర్వులు రాత్రి భోజనానికి ముందు ఐదు శివ మూర్తులకు పూజ చేసేవారట. కాని తరువాతి తరాల్లోని వారు బాల్కేశ్వర్, పృధ్వినాథ్, మనకామేశ్వర్, రాజరాజేశ్వర్ అనే నాలుగు మూర్తుల్నే పూజిస్తున్నారు. తాజ్ మహల్ గా పిలువ బడుతున్న తేజో మహలయంలోని ఆగ్రేశ్వర్ మహదేవ్ నాగ్నాథేశ్వరే మరుగున పడిపోయిన ఐదవ మూర్తి అవ్వచ్చు. * షాజహాన్ కాలంనాటి "బాద్షానామా"లో (పు.403,సం.1) డోం కలిగివున్న ఓ అద్భుత పెద్ద భవంతిని జైపూర్ మహారాజు జైసింగ్ నుంది ముంతాజ్ సమాధికోసం స్వాధీన పరచుకున్నట్లుగా వుంది. * యువరాజు ఔరంగజేబు తండ్రైన షాజహానుకు రాసిన లేఖ ప్రకారం 1652 లో ముంతాజ్ ను సమాధి చేసిన అనేక భవనాలు పాతవవడం వల్ల లీకవుతున్నాయని, డోం కు వుత్తరవైపున పగుళ్ళు వచ్చాయని, వాటికి అత్యవసర మరమ్మత్తులను తన ఖర్చుతో నే చేసినట్లు వుంది. కానీ భారత పురాతత్వ శాఖ తాజ్ మహల్ ముందుంచిన ఫలక ప్రకారం 1631 నుంది 1653 వరకూ (22 సాం||) నిర్మాణంలో వుంది. కానీ యదార్ధానికి షాజహాన్ కాలం నాటికే "తాజ్ మహల్" పాతబడి పోయినట్లు విశదమవుతుంది. * జోహన్ ఆల్బెర్ట్ మాన్డెల్స్లో 1638లో ఆగ్రాలో తన జీవితం గురించి వ్రాసినప్పుడెక్కడా తాజ్ మహల్ నిర్మాణంలో వున్నట్లెక్కడా చెప్పలేదు. (ముంతాజ్ చనిపోయిన 7 సంవత్సరాల తర్వాత). * అమెరికన్ లాబొరేటరీ నది వైపున వున్న తలుపు చెక్క మీద చేసిన Carbon 14 పరిశోధన ప్రకారం ఆతలుపు షాజహానుకు 300 సం. పూర్వపుదని తేలింది. * ఇ.బి.హావెల్, మిసెస్ కీనోయర్, మరియు సర్ డబ్ల్యూ.డబ్ల్యూ హంటర్హేవ్ అనే పేరొందిన పాశ్చాత్య ఆర్కిటెక్ట్‌ల ప్రకారం తాజ్ మహల్ హిందూ దేవాలయ సంప్రదాయాన్ననుసరించి కట్టబడిందిట. * తాజ్ మహల్ ముఖ ద్వారం దక్షిణానికూంది. అదే ఇస్లామిక్దైతే పడమరకుండలి. ఇలాంటివి సుమారు 110 కి పైగా ఓక్ గారి పుస్తకంలో సరూపంగా చెప్పబడ్డాయి.
Tajmahal The True Story authored by Shri P.N. Oak A. Ghosh Publisher, 5720 W. Little York No. 216, Houston, Texas 77091 October 17 కొన్ని చిత్రమైన సంగతులు
October 06 క్రిస్మస్ తాతగా పిలుచుకునే శాంతాక్లాజ్ తిప్పలు
ఒకవేళ నిజంగా శాంతా క్లాజ్ ఈ పంచుడు కార్యక్రమం చేపడితే ... పాపం తాత గతేంటో ??!! September 23 రాజకీయంరాజకీయం అంటే ఇంగ్లీషులో అర్థం తెలుసా మీకు? ఇంకా వివరంగా చెప్పాలా? ఈపాటికి అర్థం అయిపోయుండాలే! August 26 అమరజీవి పొట్టి శ్రీరాములు"పొట్టి శ్రీరాముల్లాంటి వారు ఓ పది మందుంటే చాలు, మనకు స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చేసేది"
- మహాత్మా గాంధీ
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి కొన్ని విషయాలు ...
August 22 కోఫీ అన్నన్ చెప్పిన కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులుయునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవెలెప్మెంట్ వాళ్ళు ప్రపంచ ప్రజల జీవన విధానాల గురించి రకరకాల సర్వేలు చేస్తూ వుంటారట. వాటిలో కొన్నింటిని కోఫీ అన్నన్ గారు బయటకు వెల్లడించారు. చూడండి.
August 03 అనుకోనివి కొన్ని...* థీరీటికల్ గా ఆలోచిస్తే టెలివిజన్ సాధ్యమేమోగానీ, నా దృష్టిలో దాని సృష్టి అసాధ్యం. దాని డెవలప్ మెంట్ గురించి ఆలోచించడం కూడా వేస్ట్. - 1926లో టెలివిజన్ లో ముఖ్యభాగమైన కేథోడ్ రే ట్యూబ్ సృష్టికర్త లీ డే ఫారెస్ట్ * ప్రపంచం మొత్తం మీద ఐదుకన్నా ఎక్కువ కంప్యూటర్లకు మార్కెట్ లేదు. * టెలిఫోన్ ను ఒక సమాచార సాధనంగా గుర్తించడానికి దానిలో చాలా లోపాలు వున్నాయి.ఇది మనకు ఏమాత్రం ఉపయోగం లేని వస్తువు. * నా కాలంలోనే కాదు, ఇంకా ఎన్నో సంవత్సరాలకు గానీ మహిళలకు ప్రధానమంత్రి అయ్యే యోగం రాదు. * అసలు ఆ సౌండే మాకు నచ్చలేదు. గిటార్ మ్యూజిక్ త్వరలో కనుమరుగైపోతుంది. * టీవీకున్న పెద్ద ప్రాబ్లెం ఏమిటంటే ప్రజలు టీవీ స్క్రీన్ కు కళ్ళప్పగించి చూడాలి. ఒక అమెరికన్ పౌరుడికి అంత తీరికా, టైమూ వుండవు. * లూయీ పాశ్చర్ జెర్మ్ థియరీ ఒక సుద్ద కట్టు కథ. మరికొన్ని...
July 27 ఏ మందాం వీటిని?మనం ఫార్వర్డ్ స్లాష్(Forward-slash) అని పిలుచుకొనే "/" సింబల్ పేరు స్లాష్ (Slash) మాత్రమే. బాక్స్లాష్ (Backslash) గా "\" సింబల్‌ను పిలుస్తాము. ఫార్వర్డ్ స్లాష్ అనేది లేదు. కొందరు ఈ గొడవంతా ఎందుకని స్ట్రోక్ (Stroke) అనీ అంటారు. మనం అప్పుడప్పుడూ వాడే PIN numberలోని PINను విశదీకరిస్తే ఏమవుతుందో తెలుసా ... Personal Identification Number number అలాగే, AC current అంటే Alternate Current current అని వస్తుంది. DC current అంటే Direct Current current అని వస్తుంది. ఇలాంటివి ఇంకా చాలా వున్నాయి. మీకేమైనా తెలిస్తే తెలియజేయ గలరు. జూలై 28 - వీవెన్
July 16 గుర్తుకొస్తున్నాయిమా టీవీ లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 కు 'గుర్తుకొస్తున్నాయి' అనే కార్యక్రమం ప్రసారం అవుతోంది. అప్పుడప్పుడు సినిమాల కోసం, పాటల కోసం టీవీ పెట్టే నేను ఈ రోజెందుకో ఛానల్స్ స్కాన్ చేస్తూండగా మా టీవీ లో ఈ కార్యక్రమం చూట్టం జరిగింది. క్లుప్తంగా కార్యక్రమం ఏమిటంటే సమాజంలోని అలనాటి (మరచిపోయిన)లబ్దప్రతిష్ఠులను పిలిచి వాళ్ళ మధురస్మృతులను మనతో పంచుకొనే కార్యక్రమం. నిజంగానే బాగుంది. చాలా టీవీల్లో చూసే ఇంటర్వ్యూల్లోలాగా కాకుండా ఇందులోని ఏంకర్ /ఇంటర్వ్యూయర్ రఘు కుంచే పిలిచిన వాళ్ళచేతే ఎక్కువ సేపు మాట్లాడించాడు.మొదట పొడి పొడిగా మొదలైనా కొద్ది సేపట్లో వాళ్ళు తమ మనసు పొరల్లోకి వెళ్ళి ఎన్నో సంగతులు చెప్పారు. ఈ రోజు బి.వసంత గారితో 'గుర్తుకొస్తున్నాయి'. వాగ్ధానం చిత్రంతో గాయనీమణిగా ప్రవేశం చేసిన వసంత గారు ఎన్నో విషయాలు చెప్పారు. తన మొదటి పాటలు, తోటి గాయకుల విశేషాలు, తను పనిచేసిన సంగీతదర్శకులు తో అనుభవాలు ఎన్నో గుర్తు తెచ్చుకున్నారు. అంతేకాదు, ఆవిడ సంగీత దర్శకత్వం వహించిన ఒక కన్నడ, ఒక తెలుగు చిత్రాల గురించీ చెప్పారు. సుమారు 3000 పాటలు పాడిన ఆవిడ, వాటితో పాటు ఇంకా పదును తగ్గని ఆవిడ కంఠస్వరంతో ఆపాత మధురాలనీ వినిపించారు. ఆసక్తి వున్నవాళ్ళు చూడండి. వచ్చేవారం ఒకప్పటి సూపర్ హీరోయిన్ 'కృష్ణవేణి' గారితో కార్యక్రమం. కృష్ణవేణిగారి గురించి ఓ రెండు ముక్కలు. అక్కినేని 'కీలుగుఱ్ఱం' సినిమాలో హీరోయిన్ ఈవిడ. రామారావు గారి మొదటి సినిమా 'మనదేశం' కు నిర్మాత ఈవిడే. ఇంకా ఎన్నో విషయాలు ఆవిడా నోటిద్వారా తెలుసుకోవాలంటే వచ్చే ఆదివారం 10:30 కు మాటీవీ చూడండి. (ఇది మాటీవీ వారికి సంబంధించిన ప్రకటన మాత్రం కాదు) July 13 ఆర్.డి.ఎక్స్ (RDX) - ముంబై ప్రేలుళ్ళ నేపథ్యంలో...![]() RDX అంటే రాయల్ డిమోలిషన్ ఎక్స్‌ప్లోజివ్ (Royal Demolition Explosive). దీనినే Research Department (composition) X, మరియూ Research Department eXplosive గానూ పిలుస్తారు. సైక్లోనైట్, హెక్సాజెన్, T4 అనే పేర్లతో కూడా పిలవబడుతుంది.
దీని సాంకేతిక నామం సైక్లో-ట్రైమీథైలీన్-ట్రై-నైట్రమైన్ (Cyclotrimethylenetrinitramine). కెమికల్ ఫార్మ్యులా - C3H6N6O6. శుద్ధరూపంలో ఇది తెల్లటి ఘన పదార్థం. స్వతహాగా మండే గుణం గల దీనిని ఇతర మిశ్రమాలతో కలిపి అత్యంత శక్తి వంతమైన ప్రేలుడు పదార్థంగా వాడతారు.
1890లోనే హాన్స్ హెన్నింగ్ అనే జర్మన్ కనుక్కున్నా దీని వుపయోగం వైద్యానికి మాత్రమే పరిమితమయ్యింది. 1920లో మొట్టమొదటి సారిగా దీని ప్రేలుడు శక్తి తెలిసివచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధంలో దీనిని విరివిగా ఇరుపక్షాలూ వాడాయి.
RDX పార్టికల్స్ మండటం ద్వారా గాలిలో కలుస్తాయి. ఆయుధ కర్మాగారాలలో ఆయుధాల తయరీలో విడుదలైన వ్యర్థమైన నీటి ద్వారా, నీరు, మరియూ భూమిలోనికి వ్యాపిస్తుంది. ఇది నీటిలో కరగడానికీ, అందులోనుంచి ఆవిరవ్వడానికీ చాలా సమయం తీసుకుంటుంది, అంతకన్నా నిదానంగా భూమిలో కలుస్తుంది. అంతేకాదు, ఇది భూమికి అంటి పెట్టుకోకుండా,మెల్లిగా భూగర్భ జలాల్లో కలిసిపోతుంది.
RDX కలిసి వున్న ధూళి/గాలి పీల్చడం వల్ల, RDX శరీరానికి తాకడం వల్ల, RDX ద్వారా కలుషితమైన నీటిని త్రాగటం వల్ల, అలాగే కలుషితమైన భూమి దగ్గర నివసించడం వల్లా జీవులు RDX ప్రభావానికి లోనవుతారు. దీనివల్ల మనుషులు, జంతువులూ నాడీ సంబంధ వ్యాధులకు గురవుతారు. దీని ప్రభావం సంవత్సరాల తరబడి వుంటుంది.
మూణ్ణెల్లపాటు RDX తిన్న ఎలుకలు, చుంచులలో శరీర బరువు తగ్గటం, కిడ్నీ, లివర్లు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించాయి. అంతేకాదు మనుషుల్లో కాన్సర్‌కి కూడా కారణమవుతుంది. National Institute for Occupational Safety and Health (NIOSH), USA వారు రోజులో పది పని గంటల సమయంలో ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 1.5 మిల్లిగ్రాముల కన్నా ఎక్కువ RDX వుండరాదని నిర్ణయించారు మరిన్ని వివరాలు వికీపీడియా లో చూడండి.
June 28 కొన్ని ఫుట్‌బాల్ ప్రపంచ కప్ రికార్డులు![]() ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నేపథ్యంలో కొన్ని విశేషాలు...
అత్యధిక గోల్స్
మిగిలిన సంవత్సరాలలో హైయ్యెస్ట్ గోల్స్ ఆరు, అంతకన్నా లోపే. ఇకపోతే,
ఆడిదాస్ (Adidas) వారి గోల్డెన్ షూ అవార్డ్ (1982 నుండి)
June 20 సూపర్ ఫాస్ట్ మైక్రో ప్రాసెసర్లుసూపర్ ఫాస్ట్, కాస్ట్ ఎఫెక్టివ్ మైక్రో ప్రాసెసర్లు వచ్చేస్తున్నాయి.
ఒకానొక ప్రయోగంలో సిలికాన్ ఆధారిత మైక్రో ప్రాసెసర్ రికార్డు స్థాయిలో దగ్గరదగ్గర సెకనుకు 500 బిలియన్ల ఆపరేషన్లు చేయగలిగింది. అంటే సాధారణ PC ల కన్నా కొన్ని వందల రెట్ల వేగం అన్నమాట.
జార్జియా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కు చెందిన పరిశోధకులు మరియూ ఐబియం మైక్రోఎలెక్ట్రానిక్స్ లేబొరేటరీ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిప్‌లో సిలికాన్ మరియు జర్మేనియం అల్లాయ్‌ను వాడారు. ఈ అల్లాయ్లో ఎలెక్ట్రాన్స్ చాలా సులభంగా కదులుతాయి. అంతేకాదు చల్లబరిచినప్పుడు మరింత వేగం పుంజుకుంటాయి.
లిక్విడ్ హీలియం నుపయోగించి చిప్‌ను -268.65' డిగ్రీలకు (ఆబ్సల్యూట్ జీరో కి కొద్దిగా క్రిందికి) తీసుకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరంగా ఆపరేటింగ్ స్పీడు 500GHz కు పైచిలుకు అందుకుంది. మామూలు గది ఉష్ణోగ్రత వద్ద కూడా సుమారు 300GHz స్పీడు నమోదు చేసింది. దీనంతటికీ కారణం చిప్ తయారీలో వాడిన ఆర్డినరీ సిలికాన్ పొర మరియు సిలికాన్-జర్మేనియం అల్లాయ్ పొరలు కలిగిన 'heterojunction bipolar transistors'
ప్రస్తుతానికి పరిశోధనలకే పరిమితమైన ఈ కొత్త టెక్నాలజీ, కమర్షియల్ మైక్రోప్రాసెసర్లలో కాంప్లెక్సిటీని అందిపుచ్చుకోవాలంటే మరికొంత కాలం ఆగాలి. June 17 అలెర్జీస్(Allergies) - ఒక చేదు నిజంఇటీవల ఎలుకలమీద జరిగన పరిశోధనలో అతి ఆరోగ్యకర వాతావరణం (overly hygenic environment) అలెర్జీలకు, వ్యాధినిరోధకశక్తి తగ్గడానికి దారితీస్తుందన్న విషయం వెలుగులోకొచ్చింది.
మామూలు ఎలుకలు, ప్రయోగశాలలో వున్న ఎలుకల రక్తాన్ని పరిశీలిస్తే తేలిన విషయమేమంటే .. (అతి)ఆరోగ్యకరమైన (ప్రయోగశాల) వాతావరణంలో పెరిగిన ఎలుకల కంటే, సహజ వాతావరణంలో పెరిగిన ఎలుకలలో వ్యాధి నిరోధక కారక ప్రోటీను సమృద్ధిగా కనిపిస్తోంది.
అమెరికాలో సుమారుగా 4-5 కోట్ల మంది రకరకాల అలెర్జీలతో బాధపడుతున్నట్లు ఒక అంచనా. ప్రాచ్య దేశాల (Eastern Countries) కంటే పాశ్చాత్య దేశాల్లోనే (Western Countries) అలెర్జీలెక్కువగా కనపడటం కొందరు శాస్త్రవేత్తలకు సందేహం కలుగజేసింది. ఫలితమే ఈ "హైజీన్ హైపోథీసిస్".
ఇందులోని విషయమేమిటంటే పంటలూ, పొలాలూ మొదలైన సహజ వాతావరణంలో పెరిగిన వారి శరీరం హానికారకం కాని మైక్రోబులు, పోలెన్లకూ అనుగుణంగా ట్రెయిన్ అవుతూ వస్తోంది. కానీ పాశ్చాత్య దేశాల్లోనివారు కృత్రిమమైన స్టెరైల్ వాతావరణంలో వుండటం వలన, ఇమ్యూన్ సిస్టాన్ని (వ్యాధినిరోధక వ్యవస్థ) ప్రేరేపించే అలెర్జీన్స్కు (Allergens) ఎక్స్పోస్ అవ్వటంలేదు. తద్వారా అనేక రకాలైన అలెర్జీలకు గురౌతున్నారు.
ఇదండీ సంగతి.
ప్రకృతిని ప్రేమించండి. గాజు గదులు వదలండి. ప్రకృతితో గడపండి.
(---News from New Scientist)
June 14 మీకు తెలుసా? - 02 (ఆస్కార్స్)
మరిన్ని ఇంకోసారెప్పుడైన...! June 07 మీకు తెలుసా? - 01 (పతాకాలు)ప్రపంచంలో నేపాల్ దేశపు జెం(ఝెం)డా ఒక్కటే చదరంగా (rectangle) వుండనిది.
ప్రపంచంలో లిబియా దేశపు జెండా ఒక్కటే ఏ రాతా, డిజైన్ లేకుండా ఒకే రంగుతో (ఆకు పచ్చ) ప్లెయిన్ గా వుండేది. నలు చదరంగా (square) వుండేది ఒక్క స్విట్జర్లాండ్ (స్విస్) దేశపు పతాకం ఒక్కటే.
బెట్సీ రాస్ (Betsy Ross) మొట్టమొదటగా అమెరికన్ జెండాను కుట్టిన మహిళ.
ఫిలిప్పీన్స్ పతాకం ఒక్కటే యుద్ధ సమయంలో తల్ల క్రిందులుగా (upside down) ఎగురవేస్తారు.
ఇంకో విషయం. వెక్సిల్లోలజీ (vexillology) అంటే పతాక శాస్త్రం .. పతాకాలను సాంకేతికంగా అధ్యయనం చేసే శాస్త్రం.
జూన్ 10 న చేర్చబడినది.
జాతీయపతాకంలో దేశపటం గల ఏకైక దేశం సైప్రస్
(త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలతో)
పరమత సహనం అంటే ఇదేనా?మూడ్రోజుల క్రితం టీవీ9 లో సింహాచలం మీద క్రిస్టియన్స్ మత ప్రచారం చేశారని వార్త చూపించారు.
ఇది అబద్దం అనటానికి లేదు. వార్త విజువల్ క్లిప్పింగ్‌తో సహా చూపించారు. ఒక్క డెక్కన్ క్రానికల్‌లో తప్ప వేరే పత్రికల్లో ఇది కనపడలేదు. ??? ఇంతేకాదు, తిరుమల మీదకూడా ఇదే విధంగా జరిగినా ఒకట్రెండు రోజులు తప్ప పెద్దసందడేం లేదు. ఇది మన చేతకాని తనమా? లేక వాళ్ళ ...
అధికారులు చెప్పినట్లుగా మత ప్రచారం తప్పుకాదు. కానీ వేరే మతాల వారి మనో భావాలను, ఆచారాలను ప్రశ్నించే విధంగా వుండకూడదు. ఇదే హిందూ లేదా ముస్లిం మత ప్రచారాలను ఏ చర్చిలోనో జరిపితే వాళ్ళ రియాక్షన్ ఎలా వుంటుందో ఆలోచించండి.
భారత దేశం పరమత సహనానికి పేరు. అంతేకానీ తన మత పతనానికి కాదు. |
||||||||||||||||||||||||||||
|
|