మురళీ కృష్ణ's profileమీకు తెలుసా!BlogLists Tools Help

Blog


    August 11

    బుడతడి మిమిక్రీ

     

    జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ కార్యక్రమంలో ఓ బుడతడి మిమిక్రీ ప్రోగ్రాం. చూసి ఆనందించండి.

      

     

    April 12

    మమ్మీకరణ - కొన్ని సంగతులు

     
    • మమ్మిఫికేషన్ - మమ్మీకరణ అనేది ఒక్క ఈజిప్షియనులకే పరిమితం కాలేదు. ఈజిప్టులో వున్న గ్రీకులు, రోమన్లు కూడా మమ్మీకరించబడ్డారు.
    • క్రీ..  5వ శతాబ్దము వరకూ ఈ మమ్మీకరణ ప్రక్రియ జరుగుతూనే వుంది. కానీ ఆ తర్వాత క్రైస్తవ మతము వేళ్ళూనుకొని బలపడేకొద్దీ సన్నగిల్లుతూ వచ్చింది.
    • క్రీ.. 400 - 1400 మధ్యకాలంలో మమ్మియా అనేది శక్తి / వృద్ధి కారకముగానూ, అనేక వ్యాధులను తగ్గించ గలిగేది గానూ భావించబడేది. ఈ మమ్మియా అనేది నిజమైన మమ్మీలను చూర్ణం చేయడం ద్వారా తయారు చేసేవాళ్ళు.
    • క్రీ.. 1600, 1700ల సమయంలో ఈజిప్టును సందర్శించిన యూరోపియన్ యాత్రికులు మమ్మీలను తమ షోకేసుల్లో అలంకరించుకొనేవాళ్ళు.
    • ఈజిప్టు పురాతన వస్తువులను అధ్యయనం చేసే ఈజిప్టాలజీ క్రమేణా ప్రాచుర్యం సంపాదించుకుని, 1800లలో ఒక బోధనా శాస్త్రంగా ఉద్భవించింది. మమ్మీపై వస్త్రాన్ని తొలగించడం అనేది యూరప్ మ్యూజియంలకు సందర్శకులను ఆకర్షించే సంఘటనగా రూపుదిద్దుకున్నది.
    • 1896లో విలియం ఫ్లిన్డర్స్ పెట్రీ అనే శాస్త్రజ్ఞుడు మమ్మీపై వస్త్రాన్ని తొలగించకుండా ఎక్స్-రే పరిజ్ఞానాన్ని ఉపయోగించి  మమ్మీలను అధ్యయనం చేయడం ప్రారంభించాడు.
    • 1970తొలినాళ్ళలో శాస్త్రజ్ఞులు కంప్యూటర్ అధారిత టోమోగ్రఫీ, CAT స్కానింగులు మొదలైన వాటి సహాయంతో మమ్మీకరణ ప్రక్రియ పూర్వాపరాలను పరిశోధించగలిగారు.
    • 80,90 దశకాలలో శాస్త్రజ్ఞులు మమ్మీలనుండి DNAను తీసి, కాలంనాటి ఈజిప్షియన్ల అలవాట్లను, పద్ధతులను, జీవన విధానాలను, వ్యాధులను, జెనెటిక్ సమాచారాన్ని తెలుసుకొనే మార్గంలో పరిశోధనలు చేస్తున్నారు.
    • సినయ్ పెనిన్సులా మరియు నైలు నది తూర్పు డెల్టా ప్రాతంలో ఈ మధ్యకాలంలో బయటపడ్డ మమ్మీలు - మమ్మీకరణలోని ప్రాతీయతా బేధాల్ని అధ్యయనం చేయడానికి, మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికీ బహుధా తోడ్పడుతున్నాయి.

     

    Sources:

    Teeter, Emily. Presentation of Maat: Ritual and Legitimacy in Ancient Egypt and Scarabs, Scarboids, Seals and Seal Impressions from Medinet Habu. N.p., n.d

    February 09

    ఆడవాళ్ళ సంగతులు కొన్ని(అమెరికా)

    • అమెరికాలోని వుద్యోగుల్లో ౪౬ శాతం (46%) మంది ఆడవాళ్ళైనా, సైంటిస్టులు, ఇంజనీర్ల విషయాని కొచ్చేసరికి వారి శాతం కేవలం ౨౩ (23%) మాత్రమేనట.
    • అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మగవారితో సమానంగా ఆడవారి సంఖ్య గనుక పెంచితే, ఐటీ లోవున్న ఖాళీలన్నీ నిండిపోతాయట.
    • ౪ (4th) వ తరగతి వరకూ సైన్సూ, లెక్కల్లో ఆడపిల్లలకూ, మగపిల్లలకూ సమానమైన ఇష్టం వున్నా, ౮ (8th) వ తరగతికి వచ్చేసరికి ఆడపిల్లల్లో మగపిల్లల్లాగా సైన్సూ,లెక్కలూ చేయగలమన్న అభిప్రాయం తగ్గుముఖం పడుతుందిట.
    • అంతేకాక, టీచర్లూ, తల్లిదండ్రులూ, తోటివారూ సైన్సూ, సాంకేతిక విషయాలకు దూరంగా వుండేటట్లు ప్రోత్సహిస్తారట.
    • వీటికి తోడు మీడియా కూడా (ప్రచార) మహిళా శాస్త్రవేత్త్లకూ, సాంకేతిక నిపుణులకూ తక్కువ గుర్తింపునిస్తోందిట.
    • ౧౯౮౪ (1984) లో ౩౭ శాతం (37%) మంది మహిళలు కంప్యూటర్ సైన్సులో పట్టా పుచ్చుకుంటే, అది ౧౯౯౯ (1999) లో౨౦ శాతం (20%) కన్నా తక్కువకు పడిపోయిందిట. కానీ తిరిగి ౨౦౦౨ (2002) లో ౩౪ శాతానికి (34%) కు పుంజుకున్నదట.
    • ఓ సర్వే ప్రకారం ఐటీ రంగంలోకి ఆడవారు రావడానికి కారణం అందరూ అనుకునేట్టు పెద్ద శాలరీ పాకేజీలు కాదట, మగవారితో సమానంగా పోటీపడి ఛాలెంజింగ్, మరియూ రిస్కీ జాబులు చెయ్యగలమని నిరూపించుకొనేందుకట.
    • ౨౦౧౦ (2010) కల్లా టెక్నాలజీ సపోర్ట్ వుద్యోగాల్లో మహిళల శాతం ౯౭ (97%) కు పెరగవచ్చట.
    • ౨౦౦౧ (2001) లో జరిగిన సర్వే ప్రకారం ఐటీ రంగంలోని మహిళలు సంపాదించిన మొత్తం ($713) మిగిలిన అన్ని రంగాల్లోని మహిళలు సంపాదించినమొత్తం ($597)కన్నా ఎక్కువట. (బ్రాకెట్లోనివి సగటు విలువలు)
    • ౨౦౦౧ (2001) జనాభా గణాంకాల ప్రకారం వుద్యోగం సంపాదించిన ప్రతి పది మంది ఇంజనీరుల్లో ఒకరు స్త్రీట.
    • టెక్నాలజీని వాడుకొనే మహిళా పారిశ్రామికవేత్తల శాతం ౫౮ (58%) వుండగా, పురుష పారిశ్రామికవేత్తలు కేవలం ౩౫ (35%) శాతం మాత్రమే నట.

    మహిళల శాతం      ౧౯౫౦(1950)     ౧౯౯౯(1999)
    డాక్టర్లు               ౬.౧% (6.1%)   ౨౪.౫% (24.5%)
    ఇంజనీర్లు            ౬.౧% (6.1%)   ౧౦.౬% (10.6%)

     

    December 20

    అద్దంలో సూరీడు

     
    అద్దంలో సూరీడంటే ఏమిటో అనుకుంటున్నారా?
     
    Viganella
    ఆల్ప్స్ పర్వతాల నడుమ లోయలో సుమారు రెండొందలు మాత్రమే జనాభావున్న విగనెల్ల అనే ఇటలీ గ్రామానికి సూర్యుడు నవెంబరు 11 నుండి ఫిబ్రవరి 2 వరకూ కనిపించడు. పేరుకు ఇటలీలోనే వున్నా సైబీరియాలో వున్నట్లుంటుంది. సూర్యుడు కనపడడు, వెలుతురు వుండదు, పైగా మంచు కురుస్తూ వుంటుంది. కానీ ఆ గ్రామానికి నాలుగైదొందల అడుగుల ఎత్తులో మాత్రం సూర్యకాంతి సోకుతుంది. విగనెల్ల మేయర్ పియర్‌ఫ్రాన్కో మిడాలి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని గీకోమో బొన్జాని అనే ఆర్కిటెక్ట్‌తో ఎక్స్‌పెరిమెంట్ చేయించి అద్దం ప్లానుతో బయటకొచ్చాడు. క్రింద బొమ్మ చూడండి అర్థం అవుతుంది.
     
     
    ఈ రకంగా ప్లాన్ చేసిన అద్దం ఐదు మీటర్ల ఎత్తు, ఎనిమిది మీటర్ల వెడల్పుతో వుండి సూర్య గమనానికి అనుగుణంగా (మోటారు సాయంతో) తిరుగుతూ వుంటుంది. దీనికి సుమారు లక్ష యూరోలు ($167,400) దాకా ఖర్చవుతుందట. ప్రస్తుతానికి ఆ గవర్నమెంటు బడ్జెటు కష్టాల్లో వుంది. ఈ పథకం ఫలించిందంటే రోజుకు సుమారు 5 గంటల పాటు సూర్యరశ్మి ఈ గ్రామాన్ని తాకుతుంది. ఓ వైపు అద్దంలో సూరీడు, మరోవైపు తెల్ల్టి మంచు ఒకే సారి చూసే భాగ్యం ఆ గ్రామస్తులకు కలుగుతుంది.
    December 19

    తాజ్ మహల్ - ట్రూ స్టోరీ

    తాజ్ మహల్ - ట్రూ స్టోరీ
     
    అందరూ అనుకుంటున్నట్లుగా తాజ్ మహల్ షాజహాన్ ప్రేయసి ముంతాజ్ స్మృతి మందిరం కాదట. అది ఒక పురాతన శివాలయమట. ఈ మాటన్నది పి.ఎన్.ఓక్ అనే ఓ పరిశోధకుడు. ఓక్ గారేమంటున్నారో టూకీగా కొన్ని వివరాలు మనమూ తెలుసుకుందాం.
     
    * 5 వ మొఘల్ చక్రవర్తైన షాజహాన్ జైపూర్ మహరాజా నుంచి స్వాధీనపరచుకొన్న "తేజో మహాలయ" మనబడే శివాలయమే నేటి "తాజ్ మహల్"
    * ఔరంగజేబు కాలం వరకూ వున్న మొఘల్ రాజ లేఖల్లో గానీ, అధికార పత్రాల్లో గానీ ఎక్కడా తాజ్ మహల్ ప్రస్తావన లేదు.
    * ప్రపంచంలో వున్న ఏ ఒక్క ముస్లిం దేశంలోనూ "మహల్" అనే పదం కలిగివున్న భవనం లేదు.
    * షాజహాన్ కాలంలో భారత దేశాన్ని దర్శించిన యూరోపియన్ దార్శనికులు ప్రాచీన సంస్కృత పదమైన "తేజ్-ఓ-మహాలయ" అనే పేరుకు దగ్గరైన "తేజ్-ఏ-మహల్"ను గురించి వర్ణించారు.
    * శివ లింగాలు, మరి కొన్ని విగ్రహాలు మూసివేయబడ్డ మందపాటి గోడల్లోను, రహస్య గదుల్లోను, పాలరాతి బేస్‌మెంట్ క్రింద వున్న ఎర్ర రాతి కట్టడాల్లోనూ వున్నట్లుగా తాజ్ మహల్ రిపేర్ వర్కర్లు చూసినట్లుగానూ తెలిసింది. అంతేకాదు ఈ విషయం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి తెలిసినా కూడా కొన్ని కారణాల వల్ల వెళ్ళడించకున్నారు.
    * తాజ్ మహల్ వున్న ఆగ్రా శివారాధనకు పేరు. ఆగ్రా లోని వెనుకటి కొన్ని తరాల పూర్వులు రాత్రి భోజనానికి ముందు ఐదు శివ మూర్తులకు పూజ చేసేవారట. కాని తరువాతి తరాల్లోని వారు బాల్కేశ్వర్, పృధ్వినాథ్, మనకామేశ్వర్, రాజరాజేశ్వర్ అనే నాలుగు మూర్తుల్నే పూజిస్తున్నారు. తాజ్ మహల్ గా పిలువ బడుతున్న తేజో మహలయంలోని ఆగ్రేశ్వర్ మహదేవ్ నాగ్‌నాథేశ్వరే మరుగున పడిపోయిన ఐదవ మూర్తి అవ్వచ్చు.
    * షాజహాన్ కాలంనాటి "బాద్‌షానామా"లో (పు.403,సం.1) డోం కలిగివున్న ఓ అద్భుత పెద్ద భవంతిని జైపూర్ మహారాజు జైసింగ్ నుంది ముంతాజ్ సమాధికోసం స్వాధీన పరచుకున్నట్లుగా వుంది.
    * యువరాజు ఔరంగజేబు తండ్రైన షాజహానుకు రాసిన లేఖ ప్రకారం 1652 లో ముంతాజ్ ను సమాధి చేసిన అనేక భవనాలు పాతవవడం వల్ల లీకవుతున్నాయని, డోం కు వుత్తరవైపున పగుళ్ళు వచ్చాయని, వాటికి అత్యవసర మరమ్మత్తులను తన ఖర్చుతో నే చేసినట్లు వుంది.  కానీ భారత పురాతత్వ శాఖ తాజ్ మహల్ ముందుంచిన ఫలక ప్రకారం 1631 నుంది 1653 వరకూ (22 సాం||) నిర్మాణంలో వుంది. కానీ యదార్ధానికి షాజహాన్ కాలం నాటికే "తాజ్ మహల్" పాతబడి పోయినట్లు విశదమవుతుంది.
    * జోహన్ ఆల్బెర్ట్ మాన్‌డెల్స్లో 1638లో ఆగ్రాలో తన జీవితం గురించి వ్రాసినప్పుడెక్కడా తాజ్ మహల్ నిర్మాణంలో వున్నట్లెక్కడా చెప్పలేదు. (ముంతాజ్ చనిపోయిన 7 సంవత్సరాల తర్వాత).
    * అమెరికన్ లాబొరేటరీ నది వైపున వున్న తలుపు చెక్క మీద చేసిన Carbon 14 పరిశోధన ప్రకారం ఆతలుపు షాజహానుకు 300 సం. పూర్వపుదని తేలింది.  
    * ఇ.బి.హావెల్, మిసెస్ కీనోయర్, మరియు సర్ డబ్ల్యూ.డబ్ల్యూ హంటర్‌హేవ్ అనే పేరొందిన పాశ్చాత్య ఆర్కిటెక్ట్‌ల ప్రకారం తాజ్ మహల్ హిందూ దేవాలయ సంప్రదాయాన్ననుసరించి కట్టబడిందిట.
    * తాజ్ మహల్ ముఖ ద్వారం దక్షిణానికూంది. అదే ఇస్లామిక్‌దైతే పడమరకుండలి.
     
    ఇలాంటివి సుమారు 110 కి పైగా ఓక్ గారి పుస్తకంలో సరూపంగా చెప్పబడ్డాయి.

    Tajmahal The True Story authored by Shri P.N. Oak 
    A. Ghosh Publisher, 5720 W. Little York No. 216, Houston, Texas  77091
     
    October 17

    కొన్ని చిత్రమైన సంగతులు

    • ఎవరికి వారు తమ మోచేయిని నాకలేరట.
    • తెలివైన వారి జుత్తులో జింక్, కాపర్‌ల శాతం ఎక్కువట.
    • ఒక గంట సేపు హెడ్‌ఫోన్స్ పెట్టుకొనటం వల్ల చెవిలో బాక్టీరియా శాతం 700 రెట్లు పెరుగుతుందట.
    • ప్రపంచంలో 50% మంది ఇప్పటివరకూ ఒక్క ఫోన్ కాల్ కూడా అందుకోలేదట.
    • పారిస్ లోని ఈఫిల్ టవర్ బరువు 1000 ఏనుగుల కంటే ఎక్కువట.
    • ప్రతి 5 సెకన్లకూ ఒక కంప్యూటర్ వైరస్ బారిన పడుతూందిట.
    • ప్రపంచంలో అతి పిన్న తల్లి తండ్రులు 1910లో చైనాలో నివసించిన 8 మరియు 9 యేళ్ళ వయసు గల ఓ పిల్ల జంటట.
    • ఒక నిమిషంలో క్రికెట్ (చిమ్మెట అనుకుంటా) చేసే శబ్దాల్ని 2తో భాగించి, 9 కలిపి, మళ్ళా 2తో భాగిస్తే సెలిసియస్‌లో టెంపరేచర్ వస్తుందట.
    • సముద్రంలో 800 మీటర్ల కన్నా లోతున వుండే చేపలకు కళ్ళుండవట.
    • ద్రాక్ష పళ్ళు మైక్రోవేవ్ వోవెన్‌లో పెడితే విస్ఫోటనం చెందుతాయట.
    • ఇద్దరి మధ్య ఫైటింగ్ (డ్యుయెల్లింగ్)అనేది పెరుగ్వేలో ఆ యిద్దరూ రక్త దాతలైతే న్యాయసమ్మతమేనట.
    • ఇంగ్లండులో Speaker of the House మాట్లాడకూడదట.
    • ఒక్క ఆదివారం తప్ప, మిగతా రోజుల్లో యార్క్ లో స్కాట్స్‌మాన్‌ను విల్లంబులతో కొట్టటం చట్టం ప్రకారం నేరం కాదట.
    • ఒక నలుచదరపు కాగితాన్ని ఏదు సార్ల కంటే ఎక్కువ ఎవరూ మధ్యకు మడవలేరట.
    • ప్రతి 200వందల మందిలో ఓక్డికి సాధారణంగా కనిపించినా సైకోపాత్ లక్షణాలుంటాయట.
    • అలస్కాలో ఎలుగుబంటుల్ని చంపటం నేరం కాకపోయినా, నిద్రపోతున్న ఎలుగుని లేపి ఫొటో తిసుకోవడం మాత్రం నిషిద్ధమట.
    • మెక్సికో నగరం సంవత్సరానికి 10 అంగుళాలు క్రుంగిపోతోందిట.
    • ఫ్రాన్స్‌లో ఐదేళ్ళ పిల్లవాడు మందు (మద్యం) కొనటం న్యాయసమ్మతమేనట.
    • మీకు సీన్‌ఫెల్డ్ (Seinfeld) అనే ఆంగ్ల ధారావాహికలోని ప్రతి భాగంలోనూ ఎక్కడో ఒకసారి, ఏదో ఒకరూపంలో సూపర్‌మేన్ కనబడతాడట.
    • శనగలు లేదా బఠాణీలు (Peanuts) డైనమెట్ తయారీలో ఒక ముడిపదార్థమట.
    • ఒక సాధారణ మనిషి తలలోంచి రోజుకు రెండు వందల వెంట్రుకలు రాలుతాయట.
    • ప్రమాదకారులుగా ముద్రపడ్డ పిచ్చివారు, మానసిక రోగుల కన్నా, తెలిసిన వారి చేతిలోనే హత్యలకు, మానభంగాలకు ఎక్కువమంది గురౌతారట.
    October 06

    క్రిస్‌మస్ తాతగా పిలుచుకునే శాంతాక్లాజ్ తిప్పలు

    1. ఇప్పటి వరకూ వర్గీకరింపబడిన జీవజాలాల్లో ఎగరగలిగే ధృవపుజింక(దుప్పి-Reindeer) లేదు. ఇంకా 300,000 జాతులు (ఎక్కువగా క్రిములు, కీటకాలే వున్నాయి) వర్గీకరింప బడలేదు కాన అందులో క్రిస్‌మస్ తాత జింక వుండే అవకాశాన్ని కొట్టిపారేయలేం.
    2. ప్రపంచంలో సుమారు 2 బిలియన్ల మంది పిల్లలున్నట్లు (18 సం. లోపు) అంచనా. అందులో శాంతా ముస్లిం, హిందూ, బౌద్ధులను పట్టించుకోడు కనుక పై మొత్తంలో 15% పని భారం తగ్గుతుంది. మిగిలిన వాళ్ళలో సగటున ఒక ఇంటికి 3.5 గురు పిల్లవాళ్ళను లెక్కవేస్తే (Population Reference Bureau ప్రకారం) 91.8 మిలియన్ల ఇండ్లు లెక్కకు వస్తాయి. కనీసం ఇంటి కొక్క పిల్లవాడైన బుద్ధిమంతుడై వుండచ్చనది భావన.
    3. వివిధ టైం జోన్లు, మరియు భూ భ్రమణలను పరిగణనలోకి తీసుకుంటే శాంతాకు 31 గంటల సమయం వుంటుంది తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడానికి. అంటే, పై చెప్పుకున్న ఇళ్ళన్నీ 31 గంటల్లో సందర్శించాలంటే శాంతా సెకనుకు 822.6 యిళ్ళు చూడాలి. అంటే సుమారుగా సెకనులో వెయ్యోవంతు సమయంలో శాంతా తన బండిని ఆపి, దిగి, పొగ్గొట్టం ద్వారా లోపలికి దూరి, తను తెచ్చిన బహుమతులను అక్క దాచి, వాళ్ళు తనకోసం వదిలిపెట్టిన పదార్ధాలను ఆరగించి, తిరిగి చిమ్నీ ద్వారా బయటకు వచ్చి, ఆపివున్న బండెక్కి తర్వాత యింటికి వెళ్ళాలి. 91.8 మిలియన్ల యిళ్ళు సమదూరంలో వున్నాయని (వుండవనుకోండి) మనలెక్క కొఱకు అనుకుంటే, ఇంటింటికీ మధ్య దూరం 0.78 మైళ్ళు, అంటే ఢెబ్భయ్యైదున్నర మిలియన్ మైళ్ళు 31 గంటల్లో తిరగాలి. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే, శాంతా సెకనుకు 650 మైళ్ళ వేగంతో (ధ్వని వేగానికి 3000 రెట్లు ఎక్కువ) ప్రయాణించాలి. అత్యంత వేగం కలిగిన మానవనిర్మిత వాహనం యూలిసిస్ (Ulysis) స్పేస్ ప్రోబ్ వేగం 27.4 మైళ్ళ కాగా, సాధారణ ధృవపు జింక గంటకు 15 మైళ్ళ వేగాన్ని అందుకోగలదు.
    4. ఇకపోతే శాంతా గారి బండి మీదున్న బరువు మరొక ఆసక్తి కరమైన విషయాన్ని చెపుతుంది. ఉదాహరణకు ప్రతిపిల్లవాడికి 2 ఫౌండ్ల బరువున్న లెగో బొమ్మల సెట్టు కన్నా పెద్ద బహుమతి ఇవ్వలేదనుకుంటే, తాతగారి బండి 321,300 టన్నుల బరువు మొయ్యాల్సి వుంటుంది. (బహు భారీ కాయుడుగా చెప్పుకునే తాత గారి బరువును మినహాయిస్తేనే సుమా!) సాధారణ ధృవపు జింక 300 ఫౌన్ల కన్నా ఎక్కువ బరువు మొయ్యలేదు మరి. ఒకవేళ ఎగిరే దుప్పి వుందనుకుంటే, అది ఓ పదిరెట్లు ఎక్కువ బరువు (సాధారణ మైన వాటితో పోలిస్తే) మోయగలదనుకుంటే, తాత గారికి 214,200 ఎగిరే దుప్పులు కావలసి వుంటుంది. ఇంకా బండి బరువు, మన తాతగారి బరువూ కలిపితే సుమారు 353,430 టన్నులుంటుంది. పోలిక కోసం ఈ చెప్పుకున్న బరువు క్వీన్ ఎలిజబెత్ కన్న 4 రెట్లు ఎక్కువ. (క్వీన్ ఎలిజబెత్ అంటే ఏమిటో అనుకునేరు ... ఓ పెద్ద షిప్పండీ బాబూ!!)
    5. 353,430 టన్నుల లోడు సెకనుకు 650 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తే అది అత్యంత తీవ్రమైన గాలి రాపిడికి గురౌతుంది. ఇది ముందున్న దుప్పులకు 14.3 క్వింటిలియన్ జౌళ్ళ శక్తిని అందజేస్తుంది.. అదీ ఒక సెకనుకు. టూకీగా చెప్పాలంటే తత్-క్షణమే పాపం దుప్పులు బూడిదకూడా మిగలనంతగా మండిపోతాయి. బండిని లాగే మొత్తం దుప్పుల గుంపు సెకనులో 4.26 వేలవ వంతులో గాల్లో కలిసిపోతాయి. ఇకపోతే మన తాత గారు తన గురుత్వాకర్షన (gravity) శక్తికి 17,500.06 రెట్లు centrifugal ఫోర్సుకు (తెలుగులో గుర్తుకు రాలేదు) లోనవుటాడు. క్రిస్‌మస్ తాత సుమారు 250 ఫౌన్ల బరువు వుంటాడనుకుంటే, 4,315,015 ఫౌన్ల ఫోర్సుతో వెనక్కి నొక్కి వేయబడతాదు.
    ఒకవేళ నిజంగా శాంతా క్లాజ్ ఈ పంచుడు కార్యక్రమం చేపడితే ... పాపం తాత గతేంటో ??!!
    September 23

    రాజకీయం

    రాజకీయం అంటే ఇంగ్లీషులో అర్థం తెలుసా మీకు?
    రాజకీయం = పాలిటిక్స్ (Politics)
    Politics = Poli+tics
    Poli అనేది Poly నుంచి వచ్చింది.
    tics అనేది Ticks కు రూపాంతరం.
    కాబట్టి
    Poly+Ticks=Politics అవుతుంది.
    ఇకపోతే,
    Poly అంటే many - "చాలా" అని అర్థం.
    Ticks అంటే Blood sucking parasites - రక్తం తాగే పరాన్నజీవులు, అంటే నల్లులన్నమాట.

    ఇంకా వివరంగా చెప్పాలా? ఈపాటికి అర్థం అయిపోయుండాలే!

    August 26

    అమరజీవి పొట్టి శ్రీరాములు

     
    "పొట్టి శ్రీరాముల్లాంటి వారు ఓ పది మందుంటే చాలు, మనకు స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చేసేది"
                                                                                     - మహాత్మా గాంధీ

    అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి కొన్ని విషయాలు ...

    • పొట్టి గురవయ్య, మహాలక్ష్మమ్మలకు మార్చ్ 16, 1901 న మద్రాసులో జన్మించారు.
    • పూర్వీకులు గుంటురు జిల్లా వారు.
    • బాంబే లోని Victoria Jubilee Technical Institute లో Sanitory Engineering లో డిప్లొమా చేశారు.
    • Great India Peninsular Railway లో రూ.250/- కు ఉద్యోగం చేశారు. 
    • 1927లో మహాత్మా గాంధీ పిలుపు మేరకు ఉద్యోగాన్ని త్యజించి సహాయ నిరాకరణోద్యమంలో చేరారు.
    • 1928లో భార్య ఒక పిల్లవానికి జన్మనిచ్చి మరణించిన కొన్ని వారాలకే పిల్లవాడూ మరణించారు.
    • మహాత్మా గాంధీ హత్యానంతరం ఆంధ్రా లోని Gandhi Memorial Fund కు Director గా నియమింప బడ్డారు.
    • 1910 నుండే ప్రత్యేకాంధ్ర రాష్ట్ర వుద్యమం జరుగుతున్నప్పటికీ పెద్దగా ఫలితమేమీ లేదు.
    • ఆగస్ట్ 15, 1951లో స్వామి సీతారం ప్రారంభించిన ఆమరణనిరాహారదీక్ష వినోభాబావే, నెహ్రూ గార్ల చొరవతో 35రోజులకే ముగిసింది ... కానీ నెహ్రూ మాట నిలబెట్టుకోక పోవడంతో ప్రత్యేక రాష్ట్రమైతే రాలేదు.  
    • లాభం లేదనుకున్న పొట్టి శ్రీరాములు 19 అక్టోబర్ 1952న మద్రాసులోని బులుసు సాంబమూర్తి గారింట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
    • డిసెంబరు 15, 1952 న 58 రోజుల నిరాహారదీక్ష తరువాత తుది శ్వాస విడిచారు.
    • మరణానంతరం జరిగిన గొడవల్లో పోలీసు కాల్పుల్లో అనకాపల్లి, విజయవాడల్లో ఏడుగురు మరణించారు. 
    • డిసెంబరు 19, 1952న గత్యంతరం లేని పరిస్థితుల్లో నెహ్రూ ప్రత్యేక రాష్ట్రానికి అనిమతిచ్చారు.
    • అక్టోబర్ 1, 1953న కర్నూలు రాజధానిగా ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
    • నవంబర్1, 1956న మరిన్ని ప్రాంతాల్ని కలుపుకుని, హైదరాబాదు రాజదానిగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. (ఇది మరో పెద్ద కథ ... మరో సారి)
    August 22

    కోఫీ అన్నన్ చెప్పిన కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు

    యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవెలెప్‌మెంట్ వాళ్ళు ప్రపంచ ప్రజల జీవన విధానాల గురించి రకరకాల సర్వేలు చేస్తూ వుంటారట. వాటిలో కొన్నింటిని కోఫీ అన్నన్ గారు బయటకు వెల్లడించారు. చూడండి.
     
    • ప్రపంచంలోని 225మంది అత్యంత ధనికుల (అందులో 60 మంది అమెరకన్లే)  మొత్తం ఆదాయాన్ని కలిపితే అది ఒక ట్రిలియన్ డాలర్ల కన్నా పైచిలుకే. ఇది ప్రపంచ జనాభాలో 47% బీదల సంవత్సరాదాయానికి సమానం. 
    • అమెరికన్లు సంవత్సరానికి 260 పౌండ్ల మాంసాన్ని వాడతారు. అదే బంగ్లాదేశ్ లో ఆరున్నర పౌండ్లేనట.
    • ఐరోపియన్లు ఐస్ క్రీమ్, తత్సంబంధిత పదార్థాల మీద 11 బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఇది ప్రపంచ జనాభాకు ఒక సంవత్సరం వరకూ మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్య సౌకర్యమూ కల్పిచడానికయ్యే దానికన్నా 2 బిలియన్ల డాలర్లు ఎక్కువ.
    • 48 తక్కువ అభివృద్ధి చెందిన దేశాల మొత్తం ఉత్పాదకత కన్నా, మొదటి ముగ్గురి ధనవంతుల ఆస్తుల మొత్తమే ఎక్కువ.
    • అమెరికన్లు సంవత్సరానికి 8 బిలియన్ డాలర్లు సౌందర్య సాధనాలపై ఖర్చ చేస్తున్నారు.ఇది ప్రపంచం మొత్తానికీ సాధారణ అక్షరాస్యతకు అవసరం అయ్యేదానికన్నా 2 బిలియన్ డాలర్లెక్కువ.
    • అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని 4.4 బిలియన్ల జనాభాలో, 
      • ఐదులో మూడవ వంతు మందికి కనీస పారిశుద్ధ్య సౌకర్యం లేదు. 
      • మూడవ వంతు మందికి మంచినీటి సౌకర్యమే లేదు. 
      • నాల్గవ వంతు మందికి నివాసం లేదు. 
      • ఐదవ వంతు మందికి మంచి ఆరోగ్య సౌకర్యం లేదు.
    • ప్రతి వెయ్యిమందికీ స్వీడన్ లో 681 టెలిఫోన్ లైన్లూ, అమెరికాలో 626 వుంటే, ఆఫ్ఘనిస్థాన్, కంబోడియా, ఛాడ్, కాంగో వంటి దేశాల్లో ఒక్కటి మాత్రమే వుంది.
    • అంచనాల ప్రకారం ప్రపంచంలోని అందరికీ కనీస చదువు, కనీస ఆరోగ్యం, సరిపడా ఆహారం, ఆడవారికి సరైన ఆరోగ్యం, మంచినీటి సరపరా, పారిశుద్ధ్య వసతులూ కల్పించడానికి సుమారు 40 బిలియన్ డాలర్లు సంవత్నరానికి అవసరం అవుతుంది. ఇది ప్రపంచం లోని 225 మంది ధనవంతుల సంపదలో 4% కన్నా తక్కువ.

    August 03

    అనుకోనివి కొన్ని...

    థీరీటికల్ గా ఆలోచిస్తే టెలివిజన్ సాధ్యమేమోగానీ, నా దృష్టిలో దాని సృష్టి అసాధ్యం. దాని డెవలప్ మెంట్ గురించి ఆలోచించడం కూడా వేస్ట్.
                      - 1926లో టెలివిజన్ లో ముఖ్యభాగమైన కేథోడ్ రే ట్యూబ్ సృష్టికర్త లీ డే ఫారెస్ట్

    * ప్రపంచం మొత్తం మీద ఐదుకన్నా ఎక్కువ కంప్యూటర్లకు మార్కెట్ లేదు.
                      - 1946లో ఐ.బి.యం. సంస్థ చైర్మన్ థామస్ జె. వాట్సన్.

    * టెలిఫోన్ ను ఒక సమాచార సాధనంగా గుర్తించడానికి దానిలో చాలా లోపాలు వున్నాయి.ఇది మనకు ఏమాత్రం ఉపయోగం లేని వస్తువు. 
                     - 1876లో వెస్ట్రన్ యూనియన్ మేథావుల సంఘం

    * నా కాలంలోనే కాదు, ఇంకా ఎన్నో సంవత్సరాలకు గానీ మహిళలకు ప్రధానమంత్రి అయ్యే యోగం రాదు.
                     - మార్గరెట్ థాచర్

    * అసలు ఆ సౌండే మాకు నచ్చలేదు. గిటార్ మ్యూజిక్ త్వరలో కనుమరుగైపోతుంది.
                     - 1962లో డెక్కా రికార్డింగ్ కంపనీ (గిటార్ ను ప్రధాన సంగీత సాధనంగా వినియోగిస్తున్న బీటిల్స్ ను తిరస్కరిస్తూ)

    * టీవీకున్న పెద్ద ప్రాబ్లెం ఏమిటంటే ప్రజలు టీవీ స్క్రీన్ కు కళ్ళప్పగించి చూడాలి. ఒక అమెరికన్ పౌరుడికి అంత తీరికా, టైమూ వుండవు.
                    - 1939లో ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్

    * లూయీ పాశ్చర్ జెర్మ్ థియరీ ఒక సుద్ద కట్టు కథ.
                   - 1872లో Pierre Paclet, Professor of Physiology at Toulouse.

    మరికొన్ని...
    * టైటానిక్ షిప్ నీటిలో మునగని విధంగా రూపొందించారట
    *
    ఐన్ స్టీన్, న్యూటన్, ఎడిసన్ లు చదువురాని మొద్దులట
    * అమితాబ్, రేఖ, సావిత్రి, చార్లీ చాప్లిన్ లు నటనకు పనికిరారట
    * విమానాలు బొమ్మలుగా తప్ప యుద్ధ అవసరాలకు పనికిరావట

     

    July 27

    ఏ మందాం వీటిని?

    మనం ఫార్వర్డ్ స్లాష్(Forward-slash) అని పిలుచుకొనే "/" సింబల్ పేరు స్లాష్ (Slash) మాత్రమే. బాక్‌స్లాష్ (Backslash) గా "\" సింబల్‌ను పిలుస్తాము. ఫార్వర్డ్ స్లాష్ అనేది లేదు. కొందరు ఈ గొడవంతా ఎందుకని స్ట్రోక్ (Stroke) అనీ అంటారు.

    మనం అప్పుడప్పుడూ వాడే PIN numberలోని PINను విశదీకరిస్తే ఏమవుతుందో తెలుసా ... Personal Identification Number number

    అలాగే, AC current అంటే Alternate Current current అని వస్తుంది. DC current అంటే Direct Current current అని వస్తుంది.

    ఇలాంటివి ఇంకా చాలా వున్నాయి. మీకేమైనా తెలిస్తే తెలియజేయ గలరు.

    జూలై 28 - వీవెన్

    PAN number - Permanent Account Number number

    July 16

    గుర్తుకొస్తున్నాయి

    మా టీవీ లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 కు 'గుర్తుకొస్తున్నాయి' అనే కార్యక్రమం ప్రసారం అవుతోంది. అప్పుడప్పుడు సినిమాల కోసం, పాటల కోసం టీవీ పెట్టే నేను ఈ రోజెందుకో ఛానల్స్ స్కాన్ చేస్తూండగా మా టీవీ లో ఈ కార్యక్రమం చూట్టం జరిగింది. క్లుప్తంగా కార్యక్రమం ఏమిటంటే సమాజంలోని అలనాటి (మరచిపోయిన)లబ్దప్రతిష్ఠులను పిలిచి వాళ్ళ మధురస్మృతులను మనతో పంచుకొనే కార్యక్రమం. నిజంగానే బాగుంది. చాలా టీవీల్లో చూసే ఇంటర్వ్యూల్లోలాగా కాకుండా ఇందులోని ఏంకర్ /ఇంటర్వ్యూయర్ రఘు కుంచే పిలిచిన వాళ్ళచేతే ఎక్కువ సేపు మాట్లాడించాడు.మొదట పొడి పొడిగా మొదలైనా కొద్ది సేపట్లో వాళ్ళు తమ మనసు పొరల్లోకి వెళ్ళి ఎన్నో సంగతులు చెప్పారు.

    ఈ రోజు బి.వసంత గారితో 'గుర్తుకొస్తున్నాయి'. వాగ్ధానం చిత్రంతో గాయనీమణిగా ప్రవేశం చేసిన వసంత గారు ఎన్నో విషయాలు చెప్పారు. తన మొదటి పాటలు, తోటి గాయకుల విశేషాలు, తను పనిచేసిన సంగీతదర్శకులు తో అనుభవాలు ఎన్నో గుర్తు తెచ్చుకున్నారు. అంతేకాదు, ఆవిడ సంగీత దర్శకత్వం వహించిన ఒక కన్నడ, ఒక తెలుగు చిత్రాల గురించీ చెప్పారు. సుమారు 3000 పాటలు పాడిన ఆవిడ, వాటితో పాటు ఇంకా పదును తగ్గని ఆవిడ కంఠస్వరంతో ఆపాత మధురాలనీ వినిపించారు.

    ఆసక్తి వున్నవాళ్ళు చూడండి. వచ్చేవారం ఒకప్పటి సూపర్ హీరోయిన్ 'కృష్ణవేణి' గారితో కార్యక్రమం. కృష్ణవేణిగారి గురించి ఓ రెండు ముక్కలు. అక్కినేని 'కీలుగుఱ్ఱం' సినిమాలో హీరోయిన్ ఈవిడ. రామారావు గారి మొదటి సినిమా 'మనదేశం' కు నిర్మాత ఈవిడే. ఇంకా ఎన్నో విషయాలు ఆవిడా నోటిద్వారా తెలుసుకోవాలంటే వచ్చే ఆదివారం 10:30 కు మాటీవీ చూడండి.

    (ఇది మాటీవీ వారికి సంబంధించిన ప్రకటన మాత్రం కాదు)

    July 13

    ఆర్.డి.ఎక్స్ (RDX) - ముంబై ప్రేలుళ్ళ నేపథ్యంలో...

     
    RDX అంటే రాయల్ డిమోలిషన్ ఎక్స్‌ప్లోజివ్ (Royal Demolition Explosive). దీనినే Research Department (composition) X, మరియూ Research Department eXplosive గానూ పిలుస్తారు. సైక్లోనైట్, హెక్సాజెన్, T4 అనే పేర్లతో కూడా పిలవబడుతుంది.
     
    దీని సాంకేతిక నామం సైక్లో-ట్రైమీథైలీన్-ట్రై-నైట్రమైన్ (Cyclotrimethylenetrinitramine). కెమికల్ ఫార్మ్యులా - C3H6N6O6. శుద్ధరూపంలో ఇది తెల్లటి ఘన పదార్థం. స్వతహాగా మండే గుణం గల దీనిని ఇతర మిశ్రమాలతో కలిపి అత్యంత శక్తి వంతమైన ప్రేలుడు పదార్థంగా వాడతారు.
     
    c4
    C-4 high explosive,  is a mix of RDX and a plasticizer that makes it firm but pliable
     
    1890లోనే హాన్స్ హెన్నింగ్ అనే జర్మన్ కనుక్కున్నా దీని వుపయోగం వైద్యానికి మాత్రమే పరిమితమయ్యింది. 1920లో మొట్టమొదటి సారిగా దీని ప్రేలుడు శక్తి తెలిసివచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధంలో దీనిని విరివిగా ఇరుపక్షాలూ వాడాయి.
     
    RDX పార్టికల్స్ మండటం ద్వారా గాలిలో కలుస్తాయి. ఆయుధ కర్మాగారాలలో ఆయుధాల తయరీలో విడుదలైన వ్యర్థమైన నీటి ద్వారా, నీరు, మరియూ భూమిలోనికి వ్యాపిస్తుంది. ఇది నీటిలో కరగడానికీ, అందులోనుంచి ఆవిరవ్వడానికీ చాలా సమయం తీసుకుంటుంది, అంతకన్నా నిదానంగా భూమిలో కలుస్తుంది. అంతేకాదు, ఇది భూమికి అంటి పెట్టుకోకుండా,మెల్లిగా భూగర్భ జలాల్లో కలిసిపోతుంది.
     
    RDX కలిసి వున్న ధూళి/గాలి పీల్చడం వల్ల, RDX శరీరానికి తాకడం వల్ల, RDX ద్వారా కలుషితమైన నీటిని త్రాగటం వల్ల, అలాగే కలుషితమైన భూమి దగ్గర నివసించడం వల్లా జీవులు RDX ప్రభావానికి లోనవుతారు. దీనివల్ల మనుషులు, జంతువులూ నాడీ సంబంధ వ్యాధులకు గురవుతారు. దీని ప్రభావం సంవత్సరాల తరబడి వుంటుంది.

    మూణ్ణెల్లపాటు RDX తిన్న ఎలుకలు, చుంచులలో శరీర బరువు తగ్గటం, కిడ్నీ, లివర్‌లు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించాయి. అంతేకాదు మనుషుల్లో కాన్సర్‌కి కూడా కారణమవుతుంది.

    National Institute for Occupational Safety and Health (NIOSH), USA వారు రోజులో పది పని గంటల సమయంలో ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 1.5 మిల్లిగ్రాముల కన్నా ఎక్కువ RDX వుండరాదని నిర్ణయించారు

     
    మరిన్ని వివరాలు వికీపీడియా లో చూడండి.
     

     
    June 28

    కొన్ని ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ రికార్డులు

     
    ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నేపథ్యంలో కొన్ని విశేషాలు...
    అత్యధిక గోల్స్
    • 1958లో ఫ్రాన్స్ కు చెందిన Just Fantain 13 గోల్స్ చేశాడు.
    • 1954లో హంగరీ కు చెందిన Sandor Kocsis 11 గోల్స్ చేశాడు.
    • 1970లో ఫ్రాన్స్-జెర్మనీ కు చెందిన Gerd Muller 10 గోల్స్ చేశాడు.
    • 1966లో పోర్చుగల్ కు చెందిన Eusebio, 1950లో బ్రెజిల్‌కు చెందిన Ademir 9 గోల్స్ చేశారు.
    • 1930లో అర్జెంటీనాకు చెందిన Guillermo Stabile, 1938లో బ్రెజిల్‌కు చెందిన Leonidas, 2002లో బ్రెజిల్ కు చెందిన Ronaldo 8 గోల్స్ చేశారు.
    • 1974లో పోలాండ్ కు చెందిన Grzegorz Lato 7 గోల్స్ చేశాడు.

    మిగిలిన సంవత్సరాలలో హైయ్యెస్ట్ గోల్స్ ఆరు, అంతకన్నా లోపే.

     
    ఇకపోతే,
    ఆడిదాస్ (Adidas) వారి గోల్డెన్ షూ అవార్డ్ (1982 నుండి)
    • 1982 - Paolo Rossi (ఇటలీ) - 6 గోల్స్
    • 1986 - Gary Lineker (ఇంగ్లాండ్) - 6 గోల్స్
    • 1990 - Salvatore Schillaci (ఇటలీ) - 6 గోల్స్
    • 1994 - Hristo Stoichkov (బల్గేరియా) - 6 గోల్స్
    • 1994 - Oleg Salenko (రష్యా) - 6 గోల్స్
    • 1998 - Davor SUKER (క్రొయేషియా) - 6 గోల్స్
    • 2002 - Ronaldo (బ్రెజిల్) - 8 గోల్స్
    June 20

    సూపర్ ఫాస్ట్‌‌ మైక్రో ప్రాసెసర్లు

    సూపర్ ఫాస్ట్‌, కాస్ట్‌ ఎఫెక్టివ్‌ మైక్రో ప్రాసెసర్లు వచ్చేస్తున్నాయి.
     
    ఒకానొక ప్రయోగంలో సిలికాన్‌ ఆధారిత మైక్రో ప్రాసెసర్‌ రికార్డు స్థాయిలో దగ్గరదగ్గర సెకనుకు 500 బిలియన్ల ఆపరేషన్లు చేయగలిగింది. అంటే సాధారణ PC ల కన్నా కొన్ని వందల రెట్ల వేగం అన్నమాట.
     
    జార్జియా ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కు చెందిన పరిశోధకులు మరియూ ఐబియం మైక్రోఎలెక్ట్రానిక్స్‌ లేబొరేటరీ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిప్‌లో సిలికాన్‌ మరియు జర్మేనియం అల్లాయ్‌ను వాడారు. ఈ అల్లాయ్‌లో ఎలెక్ట్రాన్స్‌ చాలా సులభంగా కదులుతాయి. అంతేకాదు చల్లబరిచినప్పుడు మరింత వేగం పుంజుకుంటాయి.
     
    లిక్విడ్‌ హీలియం నుపయోగించి చిప్‌ను  -268.65' డిగ్రీలకు (ఆబ్సల్యూట్ జీరో కి కొద్దిగా క్రిందికి) తీసుకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరంగా ఆపరేటింగ్‌ స్పీడు 500GHz కు పైచిలుకు అందుకుంది. మామూలు గది ఉష్ణోగ్రత వద్ద కూడా సుమారు 300GHz స్పీడు నమోదు చేసింది. దీనంతటికీ కారణం చిప్‌ తయారీలో వాడిన ఆర్డినరీ సిలికాన్‌ పొర మరియు సిలికాన్‌-జర్మేనియం అల్లాయ్‌ పొరలు కలిగిన 'heterojunction bipolar transistors'
     
    ప్రస్తుతానికి పరిశోధనలకే పరిమితమైన ఈ కొత్త టెక్నాలజీ, కమర్షియల్‌ మైక్రోప్రాసెసర్‌లలో కాంప్లెక్సిటీని అందిపుచ్చుకోవాలంటే మరికొంత కాలం ఆగాలి.
    June 17

    అలెర్జీస్(Allergies) - ఒక చేదు నిజం

    ఇటీవల ఎలుకలమీద జరిగన పరిశోధనలో అతి ఆరోగ్యకర వాతావరణం (overly hygenic environment) అలెర్జీలకు, వ్యాధినిరోధకశక్తి తగ్గడానికి దారితీస్తుందన్న విషయం వెలుగులోకొచ్చింది.

     

    మామూలు ఎలుకలు, ప్రయోగశాలలో వున్న ఎలుకల రక్తాన్ని పరిశీలిస్తే తేలిన విషయమేమంటే .. (అతి)ఆరోగ్యకరమైన (ప్రయోగశాల) వాతావరణంలో పెరిగిన ఎలుకల కంటే, సహజ వాతావరణంలో పెరిగిన ఎలుకలలో వ్యాధి నిరోధక కారక ప్రోటీను సమృద్ధిగా కనిపిస్తోంది.

     

    అమెరికాలో సుమారుగా 4-5 కోట్ల మంది రకరకాల అలెర్జీలతో బాధపడుతున్నట్లు ఒక అంచనా. ప్రాచ్య దేశాల (Eastern Countries) కంటే పాశ్చాత్య దేశాల్లోనే (Western Countries) అలెర్జీలెక్కువగా కనపడటం కొందరు శాస్త్రవేత్తలకు సందేహం కలుగజేసింది. ఫలితమే ఈ "హైజీన్ హైపోథీసిస్".

     

    ఇందులోని విషయమేమిటంటే పంటలూ, పొలాలూ మొదలైన సహజ వాతావరణంలో పెరిగిన వారి శరీరం హానికారకం కాని మైక్రోబులు, పోలెన్‌లకూ అనుగుణంగా ట్రెయిన్ అవుతూ వస్తోంది. కానీ పాశ్చాత్య దేశాల్లోనివారు కృత్రిమమైన స్టెరైల్ వాతావరణంలో వుండటం వలన, ఇమ్యూన్ సిస్టాన్ని (వ్యాధినిరోధక వ్యవస్థ)  ప్రేరేపించే అలెర్జీన్స్‌కు  (Allergens) ఎక్స్‌పోస్‌ అవ్వటంలేదు. తద్వారా అనేక రకాలైన అలెర్జీలకు గురౌతున్నారు.

     

    ఇదండీ సంగతి.
     
    ప్రకృతిని ప్రేమించండి. గాజు గదులు వదలండి. ప్రకృతితో గడపండి.

     (---News from New Scientist)

     

    June 14

    మీకు తెలుసా? - 02 (ఆస్కార్స్‌)

    Nominations Announcement on Tuesday January 31st!

    • మే 1927 న ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్ అవార్డ్స్) స్థాపించబడింది.
    • మొదటి సంవత్సరంలో 36 మంది సభ్యులుంటే ఇప్పుడు 6000లకు పైగా గౌరవ సభ్యులున్నారు.
    • 1953లో మొదటిసారిగా ఆస్కార్స్ TVలో ప్రదర్శించ బడ్డాయి.
    • 2005వ సంవత్సరం వరకూ,ఆస్కార్ ఫంక్షన్ 32 సార్లు సోమవారం రాత్రి, 21 సార్లు గురువారం రాత్రి, 8 సార్లు బుధవారం రాత్రి, 6 సార్లు మంగళవారం, 2 సార్లు శుక్రవారం రాత్రి నిర్వహించబడ్డాయి.
    • 1930 లో రెండు సార్లు (3-ఏప్రిల్, 5-నవంబర్) ఆస్కార్ నిర్వహించబడింది. అయితే 1933లో అసలు జరగనే లేదు.
    • ఇంతవరకూ మూడు సార్లు ఆస్కార్ గెలుచుకున్న ఉత్తమ నటుడెవరూ (Best Actor) లేరు.
    • కేథరీన్ హెప్‌బర్న్ (Katherine Hepburn) మత్రమే నాలుగు సార్లు ఉత్తమ నటి (Best Actress) గా ఆస్కార్ తీసుకుంది.
    • లస్ట్ ఫర్ లైఫ్ (Lust for Life) చిత్రంలో పెయింటర్ పాల్ గాగిన్ (Paul Gaugin) గా నటించినందుకు ఆస్కార్ తీసుకున్న ఆంథోనీ క్విన్ (Anthony Quinn), ఆ చిత్రంలో కనిపించింది 8 నిమిషాలు మాత్రమే.
    • అత్యధిక ఆస్కార్ అవార్డులు పొందిన చిత్రలు జేమ్స్ కామెరాన్ - టైటానిక్ (James Cameron - Titanic) (1999) మరియు విలియం వైలర్ - బెన్ హర్ (William Wyler - Ben Hur)(1956). ఒక్కొక్కటి 11 అవార్డులు గెల్చుకున్నాయి.
    • 1935లో రచయిత డడ్లీ నికాల్స్ (Dudly Nichols), 1970 లో జార్జ్ సి.స్కాట్ - పాటన్ (George C. Scott - Pattan), 1972 లో మార్లన్ బ్రాండో - గాడ్ ఫాదర్ (Marlon Brando - God Father) ఆస్కార్‌ను తీసుకోవడానికి నిరాకరించారు.

    మరిన్ని ఇంకోసారెప్పుడైన...!

    June 07

    మీకు తెలుసా? - 01 (పతాకాలు)

     
    ప్రపంచంలో నేపాల్‌ దేశపు జెం(ఝెం)డా ఒక్కటే చదరంగా (rectangle) వుండనిది.

    ప్రపంచంలో లిబియా దేశపు జెండా ఒక్కటే ఏ రాతా, డిజైన్‌ లేకుండా ఒకే రంగుతో (ఆకు పచ్చ) ప్లెయిన్‌ గా వుండేది.
     
    నలు చదరంగా (square) వుండేది ఒక్క స్విట్జర్లాండ్‌ (స్విస్‌) దేశపు పతాకం ఒక్కటే.
     
    బెట్సీ రాస్‌ (Betsy Ross) మొట్టమొదటగా అమెరికన్ జెండాను కుట్టిన మహిళ.
     
    ఫిలిప్పీన్స్‌ పతాకం ఒక్కటే యుద్ధ సమయంలో తల్ల క్రిందులుగా (upside down) ఎగురవేస్తారు.
     
     
    ఇంకో విషయం. వెక్సిల్లోలజీ (vexillology) అంటే పతాక శాస్త్రం .. పతాకాలను సాంకేతికంగా అధ్యయనం చేసే శాస్త్రం.
     
     
    జూన్‌ 10 న చేర్చబడినది.
     
    జాతీయపతాకంలో దేశపటం గల ఏకైక దేశం సైప్రస్
    (త్రివిక్రమ్‌ గారికి కృతజ్ఞతలతో) 
     

    పరమత సహనం అంటే ఇదేనా?

    మూడ్రోజుల క్రితం టీవీ9 లో సింహాచలం మీద క్రిస్టియన్స్‌ మత ప్రచారం చేశారని వార్త చూపించారు.
     
    ఇది అబద్దం అనటానికి లేదు. వార్త విజువల్‌ క్లిప్పింగ్‌తో సహా చూపించారు. ఒక్క డెక్కన్‌ క్రానికల్‌లో తప్ప వేరే పత్రికల్లో ఇది కనపడలేదు. ??? ఇంతేకాదు, తిరుమల మీదకూడా ఇదే విధంగా జరిగినా ఒకట్రెండు రోజులు తప్ప పెద్దసందడేం లేదు. ఇది మన చేతకాని తనమా? లేక వాళ్ళ ...
     
    అధికారులు చెప్పినట్లుగా మత ప్రచారం తప్పుకాదు. కానీ వేరే మతాల వారి మనో భావాలను, ఆచారాలను ప్రశ్నించే విధంగా వుండకూడదు. ఇదే హిందూ లేదా ముస్లిం మత ప్రచారాలను ఏ చర్చిలోనో జరిపితే వాళ్ళ రియాక్షన్‌ ఎలా వుంటుందో ఆలోచించండి.
     
    భారత దేశం పరమత సహనానికి పేరు. అంతేకానీ తన మత పతనానికి కాదు.